శ్వేతసౌధ అధినేత డోనాల్డ్ ట్రంప్.. హిల్లరీపై స్పష్టమైన అధిక్యత Donald Trump stuns the world, elected USA's 45th president

Donald trump stuns the world elected usa s 45th president

Hillary Clinton, Hillary first win, US Presidential Elections, election results, 45th president, America, democratic, republican, donald trump presidnet of US. american president donald trump

Donald Trump stunned the world by winning the title of president-elect early Wednesday, storming to crucial victories in a series of battleground states and emerging the victor of a bitterly fought campaign by a razor-thin margin.

శ్వేతసౌధ అధినేత డోనాల్డ్ ట్రంప్.. హిల్లరీపై స్పష్టమైన అధిక్యత

Posted: 11/09/2016 01:56 PM IST
Donald trump stuns the world elected usa s 45th president

యావత్ ప్రపంచం ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అందరి అంచనాలను తారుమారు చేసి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి సిద్దమైయ్యారు రిపబ్లికన్ పార్టీ అబ్యర్థి డోనాల్డ్ ట్రంప్. నడిరోడ్డు మీద తానెవరినైనా తుపాకీతో కాల్చినా.. తనను అమెరికా అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకోగలిగే శక్తి ఎవరికీ లేదని అదితలోనే వివాదాస్పద వ్యాక్యలు చేసినా.. చివరి వరకు ఆయనను వివాదాలు వెంటాడినా.. అయనే అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

గత ఆరు పర్యాయాలుగా అమెరికా అధ్యక్ష రేసులో ఎవరూ సాధించని ఏకపక్ష మెజారిటీతో ఆయన శ్వేతసౌధంలోకి అడుగుపెట్టనున్నారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై కౌంటింగ్ ప్రారంభం నుంచి స్పష్టమైన అదిపత్యం ప్రదర్శించిన ట్రంప్ అమెపై కోటి పైచిలుకు ఓట్ల మెజారిటీని సాధించారు. ట్రంప్ తన ఖాతాలో 5 కోట్ల 72 లక్షల 2 వేల 637 ఓట్లను వేసుకోగా, హిల్లరీ క్లింటన్ 5 కోట్ల 62 లక్షల 54 వేల 978 ఓట్లను సాధించారు. ఇంకా కొన్న రాష్ట్రాలలో కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ.. ట్రంప్ స్పష్టమైన మెజారిటీ లభించడంతో అయనే అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా తేలిపోయింది.

విజయానికి అవసరమైన 270 స్థానాలకు ఆయన 276 స్తానాలను సాధించారు. అటు సెనేట్ లో కూడా రిపబ్లికన్ పార్టీ స్పష్టమైన అధిక్యతను కనబర్చింది. సెనేట్ లో అవసరమైన 51 బలాన్ని సరిగ్గా అందిపుచ్చుకుంది. దీనికి తోడు హౌజ్ లో కావాల్సిన బలం 218కి ఆయన 235 సాధించి విజయాన్ని అందుకున్నారు. అమెరికాలోని మొత్తం 51 రాష్ట్రాల్లో ట్రంప్ 27, హిల్లరీ 18 రాష్ట్రాల్లో గెలుపొందారు. మరో 6 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి వుంది. ట్రంప్ విజయం ఖాయమని తేలడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా, హిల్లరీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. పూర్తి ఫలితాలు వెలువడకుండానే హిల్లరీ నివాసం నుంచి ఆమె మద్దతుదారులు నిరాశతో వెనుదిరిగారు. ట్రంప్ శిబిరం సందడిగా మారింది. హిల్లరీ క్లింటన్ ఓటమిని అంగీకరిస్తూ ట్రంప్కు అభినందనలు తెలిపింది.స్థానికులకు ఉద్యోగాల కల్పన, పేదరిక నిర్మూలణ వంటి అభ్యుదయ ప్రసంగాలతో అమెరికా వాసులను కట్టిపడేశారు. దీంతో గత నాలుగు పర్యాయాలుగా డెమొక్రట్లకు ఓటు వేస్తున్న ప్రజలు ఈ సారి ట్రంప్ మాటలను విశ్వసించి.. అయనకు ఓటు వేసి ప్రపంచదేశాలు విస్మయం చెందేలా తీర్పునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hillary Clinton  donald trump  US Presidential Elections  45th president  America  

Other Articles