ప్రధాని సంచలన నిర్ణయంతో కుప్పకూలిన మార్కెట్లు.. Sensex crashes 1600pts, Nifty below 8100 on US polls,black money

Sensex nifty seen falling over scrapping of rs1 000 rs500 notes

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Sensex, Nifty are slated to open sharply lower on Wednesday after govt withdrew Rs1,000 and Rs500 currency notes in an attempt to crack down on black money

ఆ రెండింటి ప్రభావంతో కుప్పకూలిన మార్కెట్లు..

Posted: 11/09/2016 10:36 AM IST
Sensex nifty seen falling over scrapping of rs1 000 rs500 notes

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభంతోనే కుప్పకూలాయి. నిన్న రాత్రి ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో మార్కెట్లు కుదేలయ్యాయి. నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్స్ గా పేర్కొంటూ తీసుకున్న నరేంద్రమోడీ ప్రభుత్వం 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం మదుపరులకు రుచించకపోవడంతో దేశీయ సూచీలపై దాని ప్రబావం వడింది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటర్ల అంచనాలను తారుమారు చేస్తూ డెమెక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రేసులో ముందంజలో వుండటం, రమారమి అయనకే అధ్యక్ష పగ్గాలు దక్కుతున్నట్లు ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలీపోయాయి.

ఉదయం మార్కట్లు ప్రారంభంతోనే మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా కుదేలైంది. ప్రస్తుతం కొద్దిగా కోలుకున్న మార్కెట్లు కొంతమేర నష్టాలను భర్తీ చేసకున్నప్పటికీ.. దేశీయ సూచీలు ఇంకా పతనం అంచునే కోనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 998 పాయింట్ల నష్టంతో 26.579 వద్ద ట్రేడింగ్ కోనసాగిస్తుండగా, నిఫ్టీ 339 నష్టంతో 8,203గా కొనసాగుతోంది. ఇదే రకంగా ట్రేడింగ్ కోనసాగిన నేపథ్యంలో మార్కెట్లు సాయంత్రానికి ఎన్ని పాయింట్లను కోల్పోతాయి.. ఎన్ని లక్షల కోట్ల రూపాయలను హరించుకుపోతాయన్న భయం అన్ని వర్గాల్లో కోనాసాగుతుంది.

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావంతో అమెరికన్ మార్కెట్లతో పాటు ఆసియా మర్కెట్లు కూడా భారీ పతనం అంచున సాగుతున్నాయి, డాలర్ విలువ కూడా పడిపోయింది. ట్రంప్ ఎఫెక్ట్తో బంగారం భగ్గుమంటోంది. బ్యాంకింగ్, ఆటో షేర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, కన్సూమర్ డ్యూరెబుల్ స్టాక్స్ కూడా అతలాకుతలమవుతున్నాయి. ఈ ఎఫెక్ట్తో పెట్టుబడిదారుల 300 కోట్ల  సంపద ఆవిరైనట్టు అర్థిక నిఫుణులు అంచనా వేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles