Man smoked cigarette on baby face but got appreciated

crazy indians, Best Prank, Latest Prank 2016, Anti Smoking Prank, Social Experiment, Best Indian Prank ever, Best Indian Social Experiment, Anti Pollution Social experiment, pollution in the city, polluted country, next generations, crazy indians prank, smoke, child, message, trending video, viral video

crazy indian uploaded a video by which they give call to the indian citizens to act first before reacting on pollution in the country.

ITEMVIDEOS: పసివాడి ముఖంపై పొగ.. మీరు చూస్తే ఎంచేస్తారు..?

Posted: 11/08/2016 04:18 PM IST
Man smoked cigarette on baby face but got appreciated

అదోక బస్టాండు.. దాని మీదుగా వెళ్తున్న బస్సులు, అటోలు అప్పటికే పొగను వెదజల్లుతున్నాయి. మన కాలుష్య ప్రబావంతో ఒక్కసారి సిగరెట్ పిల్చినా.. అది 40 సిగరెట్లు తాగిన దానితో సమానమంటూ దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితిని మరీ దయనీయంగా తయారైందని ఇప్పటికే ప్రమాద గంటికలు మోగిస్తున్నా.. పట్టని దేశ ప్రజలు అందులోనూ మరీ ముఖ్యంగా పోగరాయుళ్లు.. తమ అలవాట్లను మాత్రం మానుకోవడం లేదు.

తాంబూలాలు ఇచ్చాం తన్కుకు చావండీ అన్నట్లు ప్రభుత్వాలు కూడా పోగ త్రాగడంపై పెద్దగా పట్టించుకోవడం లేదు. పబ్లిక్ ప్లేస్ లలో సిగరెట్ తాగడం నిషేధమని తెలిసినా.. పోగరాయుళ్ల పొగకు అడ్డూఅదుపు లేదు. సరిగ్గా అలాగే జరిగింది ఇక్కడ కూడా. ఓ తల్లి తన నెలల బిడ్డతో బస్టాండ్ లో కూర్చోని వుంది. అమె పక్కనే ఓ యువకుడు కూడా కూర్చని వున్నాడు. అయితే అతడు సిగరెట్ తాగి ఆ పోగను ఏకంగా పక్కున కూర్చున్న మహిళ ఒడిలోని పిల్లాడి ముఖంపై ఊదుతున్నాడు.

పోగ పడక పిల్లాడు ఏడవడం కూడా ప్రారంభించాడు. అది చూసి బస్టాండ్ లోకి వచ్చిన పలువరు వ్యక్తులు స్పందించారు. ఒకానోక దశలో పోగతాగే వ్యక్తితో వాగ్వాదానికి కూడా దిగారు. కొందరు పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అయితే నిజం తెలిసి నవ్వుకున్నారు. ఏంటా నిజం.. అమె ఒడిలో వున్నది పిల్లాడు కాదు బొమ్మ, పిల్లాడు ఏడ్చినట్టుగా ఫోన్ నుంచి రింగ్ టోన్. దీనిని క్రేజీ ఇండియన్స్ అనే సంస్థ దీనిని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.

అయితే దీని వెనుక మంచి సందేశం కూడా వుంది,. పిల్లాడి ముఖంపై పోగఊదడంలో స్పందిచిన వారిని నిర్వహాకులు స్పందింపజేసి.. దాని వెనకనున్న అంతరార్థాన్ని వివరించారు. అదేంటంతే.. ఇలాంటి ఘటనలపై ప్రతిస్పందించడానికి ముందు.. అలాంటి ఘటనలను నివారించాలని పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో వాయుకాలుష్యం శృతి మించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులు ఒక్కసారి పోగపీల్చినా 40 సిగరెట్లు తాగినట్లు అవుతుందని.. అందుకనే కాలుష్యాన్ని నివారిద్దామన్న సందేశాన్ని ఇచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది., దీనిని అప్ లోడ్ చేసిన 24 గంటల్లోనే 82 వేల మంది దీనిని వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crazy indians  prank  smoke  child  message  trending video  viral video  

Other Articles