నోళ్లూరిస్తున్న గాలివారి ఇంటి పెళ్లి మెనూ..! World food fest menu on gali janardhan reddy daughter's marriage

World food fest menu on gali janardhan reddy daughter s marriage

Gali Janardhan Reddy Gali Janardhan Reddy daughter Wedding, gali janardhan daughter food menu, Expenses, daughter Wedding, food menu, Rs 100 cr, Expenses, bengaluru palace

World famous food festival menu on mining baron and former karnataka gali janardhan reddy daughter's marriage

నోళ్లూరిస్తున్న గాలివారి ఇంటి పెళ్లి మెనూ..!

Posted: 11/08/2016 08:15 PM IST
World food fest menu on gali janardhan reddy daughter s marriage

అకాశమంత పందరి.. భూదేవంత పీట వేసి తన కూతరు పెళ్లి చేయాలని అందరూ తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే డబ్బున్న మారాజులకు మాత్రమే అది సాధ్యమౌతుందన్న విషయం చివరాఖున కానీ తెలియదు. అయితే డబ్బున్న వాళ్లకు కూడా తమ హోదాకు తగ్గట్టుగా పెళ్లి చేయాలంటూ ఖర్చు కూడా అధికమే అవుతుంది. స్వల్పంగా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాక తప్పదు. కానీ మైనింగ్ రారాజుగా పేరొందిన.. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి మాత్రం తన కూతురి వివాహన్ని అత్యంత ఘనంగా చేయాలని భావిస్తున్నారు. ఎంత రిచ్ గా అంటే పెళ్లి పందిరి ప్రారంభానికి ముందు నుంచే వచ్చే అతిధి మహారథులకు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

ఇక పెళ్లి అని చెప్పగానే అతిథ్యం నుంచి వధూవరులను అశీర్వదించే వరకు అన్నింటా గాలి తన మార్కును ఉట్టిపడేలా చేయనున్నారు. ఇప్పటికే తన కూతురు అహ్వాన పత్రికల అంశంలో అటు జాతీయ స్థాయి మీడియాను కూడా అకర్షించిన గాలి జనార్థన్ రెడ్డి.. అందులో తనతో పాటు తన భార్య, కోడుకు వారింట పెళ్లికి రావాలని అహ్వానిస్తూ సాగిన పాట, బాలీవుడ్ స్తాయిలో పాట చిత్రీకరణ..  కూతురు, అల్లుడితో కలసి సాగిన తీరు, అహ్వానించే విధానం హైలెట్ గా నిలిచింది. ఒక్కో అహ్వాన పత్రిక కోసం గాలి అరు వేల రూపాయల పైచిలుకు ఖర్చు చేశారని టాక్.

ఇవన్నీ ఒక ఎత్తుగా నిలిస్తే.. ఎంత ఘనంగా పెళ్లి చేశాం అన్నది కాదు..ఎంత రుచిగా పెళ్లి బోజనం పెట్టాం.. అన్నదే అన్ని వర్గాల పెళ్లిళ్లలో హాట్ టాపిక్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. పెళ్లికి వచ్చిన అతిధులు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రుచికరమైన వంటకాలను వడ్డించాలని అందరూ వారి స్థాయి మేరకు విశ్వప్రయత్నాలు చేస్తారు. ఇందుకు గాలి జనార్థన్ రెడ్డి ఏ మాత్రం మినహాయింపు కాదు. అందుకనే కాబోలు తన కూతురు పెళ్లికి బోజన ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు.

ప్రపంచ ప్రాముఖ్యత పొందిన వెయ్యి రకాల వంటకాలను తన కూతురు పెళ్లిలో అతిధులకు వడ్డించనున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేయాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. పెళ్లి వేడుకలకు సినీ రంగ ప్రముఖులు మొదలుకొని రాజకీయ.. పారిశ్రామికవేత్తల వరకూ పోటెత్తుతారని చెబుతున్నారు. పెళ్లి వేడుకకు వచ్చే ప్రముఖుల కోసం.. బాలీవుడ్ ప్రముఖుల చేత ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నవంబరు 16న బెంగళూరు ప్యాలెస్ లో జరిగే గాలి వారి పుత్రిక బ్రాహ్మణి పెళ్లికి సంబంధించి ఇంకెన్నీ అసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే. కాగా వెయ్యి రకాల వంటకాలనగానే బోజన ప్రియుల నోళ్లూరిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gali Janardhan Reddy  daughter Wedding  food menu  Rs 100 cr  Expenses  bengaluru palace  

Other Articles

Today on Telugu Wishesh