ముగ్గురు మహిళలపై గ్యాంగ్ రేప్..సకాలంలో స్పందించని పోలీసులు 3 Women Allegedly Gangraped By Robbers

Three women allegedly gangraped by robbers posing as cops

rape, gangrape, women gangrape, greater noida, greater noida woman gangraped, women gangraped greater noida, 3 women gangraped noida, sexuall assult on women, gangrape on women, robbers gangrape women, india news, crime news, crime

3 women gangraped by men posing as cops, the assailants tied up the men of the families and looted their belongings, ate at the house and stole six chicken.

పోలీసులమని చెప్పి.. ముగ్గురు మహిళలపై గ్యాంగ్ రేప్..

Posted: 11/03/2016 11:51 AM IST
Three women allegedly gangraped by robbers posing as cops

తాము పోలీసులమని, నకిలీ మద్యం వుందన్న సమాచారంతో ఇళ్లను తనిఖీ చేస్తున్నామని చెప్పి.. ఇంట్లో వున్న ఆడవారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డిన గుర్తు తెలియని అగంతకులను తక్షణం అరెస్టు చేయాలని బాధిత కుటుంబాలు జిల్లా రూరల్ ఎస్పీని వేడుకున్నాయి. అత్యాచారాలతో పాటు తమ ఇంట్లో ఉన్న ఆభరణాలు, డబ్బును దోచుకెళ్లారని కూడా వారు అరోపించారు. దేశరాజధాని ఢిల్లీ నగర శివార్లలోని గ్రేటర్ నోయిడా జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ బాధిత కుటుంబాలు నోయిడా రూరల్ ఎస్పీ కార్యాలయాని వచ్చి పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..ఢి్ల్లీ శివార్లలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల ఇంటికి సాయుధులైన దొంగలు వచ్చారు. అయితే  తాము పోలీసులమని చెప్పి తలుపు తెరిపించారు. ఆపై ఇంట్లో ఉన్న ఓ మహిళకు తుపాకీ చూపించి బెదిరించి అత్యాచారం జరిపాడు. ఇలా ఒకరి వెంట మరొకరు ఏడుగురు తనపై అత్యాచారం జరిపారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత తమ పోరుగున నివాసముంటున్న మరో ఇద్దరు మహిళలపై కూడా దుండగులు అఘాయిత్యం చేశారని బాధితురాళ్లు ఫిర్యాదు చేశారు. దొంగలు తనపై అత్యంత కిరాతకంగా అఘాయిత్యం చేస్తున్నా వారి ఎదుట నిస్సహాయంగా ఉండిపోయానని ఓ బాధితురాలు ఎస్పీ సుజాత సింగ్ కు ఫిర్యాదు చేశారు.

కాగా మరో మహిళ తాను గర్భిణి అని, తనను ఏం చేయకండనీ ప్రాధేయపడినా వదల కుండా అమెపై కూడా అత్యాచార జరిపుతున్న ఇంటికి తీసుకువచ్చిన అగంతకులు.. ఆ తరువాత మాత్రం తనను వదిలిపెట్టారని చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి, బాధితులను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని ఎస్పీ సుజాత సింగ్ పేర్కొన్నారు. అత్యాచారాన్ని అడ్డుకున్న ఓ మహిళను దోపిడీ దొంగలు కొట్టి, ఆమెపై పలుమార్లు అఘాయిత్యం చేశారని స్థానిక ఇటుకబట్టి యాజమాని దీరేంద్రసింగ్ చెప్పారు.

కాగా ఈ ఘటనపై తామకు సమాచారం అందడంతోనే తాము పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకోచ్చామని, పోలీసులు సకాలంలో స్పందించి వుంటే వారిని ఘటనాస్థలంలోనే పట్టుకునే అవకాశం వుండేదని చెప్పారు. తెల్లవారుజాము 3 గంటల వరకు ఆగంతకులు ఘటనాస్థలిలోనే వున్నారని కూడా ఆయన చెప్పారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ సుజాతా సింగ్ 8.30 గంటలకు తొలి ఘటన జరిగిందని, దీనిపై పోలీసులకు రాత్రి పదిన్నరకు సమాచారం అందిందని అయినా అప్పటి వరకు పోలీసులు ఎందుకు పెట్రోలింగ్ నిర్వహించలేదో విచారణలో తేలుస్తామని చెప్పారు. ఇక ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిపింది ఒక్క ముఠానేనా అన్నది కూడా దర్యప్తులో తెలుతుందని అమె చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women  greater nodia  gangrape  robbers  police  crime  

Other Articles