పెట్రోల్ బంకుల బంద్.. ఇక మిగిలింది రెండు రోజులే.. Petroleum dealers to go on nationwide strike on November 6

Petroleum dealers to go on nationwide strike on november 6

Petroleum dealers strike, All India Petroleum Dealers Association, Petroleum, oil marketing companies, Strike

Petroleum dealers will not make purchases from the oil marketing companies from today but continue to sell fuel and will go on a full-fledged strike.

పెట్రోల్ బంకుల బంద్.. ఇక మిగిలింది రెండు రోజులే..

Posted: 11/03/2016 11:49 AM IST
Petroleum dealers to go on nationwide strike on november 6

పెట్రోల్ బంకు డీలర్ల సమస్యలను పరిష్కారించాలని గత కొంతకాలంగా నిరసనకార్యక్రమాలను చేపడుతున్నా.. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు పెట్రోలియం సంస్థలు కానీ స్పందించకపోవడంతో పెట్రల్ బంకులు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. తమ నిరసన కార్యక్రమాలలో చివరి అంకానికి ముందుగా ఇవాళ, రేపు డీలర్లు పెట్రో కంపెనీల నుంచి అయిల్ కొనుగోళ్లను నిలిపివేయనున్నారు. దీంతో పాటు 5వ తేదీని సాయంత్రం ఐదు గంటల వరకే మాత్రమే ఇంధనాన్ని విక్రయించనున్నారు. ఇక ఆ తరువాత నుంచి పెట్రోల్ కోసం ఎంత అన్వేషించినా లాభం లేదు. ఎందుకంటే పెట్రోల్ బంకులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చాయి.

ఈ మేరకు ఎపి ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయని తెలిపారు. 6వ తేదీన పూర్తి స్థాయిలో బంకులు మూసివేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 80 శాతం పెట్రోలు బంకులను నష్టాల నుంచి కాపాడుకోవాలన్నదే తమ ఆందోళన ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆందోళన బాట పట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పెట్రోల్ బంకుల బంద్ నేపథ్యంలో వాహనదారులు ఏమాత్రం ఏమరపాటు వహించినా ఇంటివరకో.. లేక కార్యాలయాల వరకో తమ వాహనాలను తోసుకెళ్లక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles