‘‘సత్యాన్వేషులూ.. ఇక చాలు..’’ కమేడియన్ వేణుమాధవ్ Comedian Venu madhav Cries About His Death RUMOURS

Comedian venu madhav breaks down while reacting on his death news and gets emotional

Popular Tollywood comedian Venu Madhav, Venu Madhav, Popular comedian, tollywood, governor esl narasimhan, talsani srinivas yadav, viral news, venu madhav latest interview, venu madhav is not dead, venu madhav about his death, venu madhav gets emotional, venu madhav latest controversies, venu amdahv files a complaint on telugu new channel

Popular Tollywood comedian Venu Madhav earlier lodged a complaint in Kushaiguda Police Station against a Telugu news channel and two social media websites

ITEMVIDEOS: ‘‘సత్యాన్వేషులూ.. ఇక చాలు..’’ కమేడియన్ వేణుమాధవ్

Posted: 11/01/2016 11:32 AM IST
Comedian venu madhav breaks down while reacting on his death news and gets emotional

నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం అని పెద్దలు అంటుంటారు. ఇది నిజంగా సత్యమని నవ్వుతూ వుండేవారికి తెలుస్తుంది. ఇక సైంటిఫిక్ గానూ ఇది వాస్తవమని డాక్టర్లు కూడా తేల్చారు. నవ్వితే కలిగే శరీర కదలికలను బట్టి.. ఏడ్చే వారి శరీర కదలికను పోల్చిన పిమ్మట నిజమే.. నవ్వడం ఒక భోగమేనంటున్నారు. రాజుల కాలంలో యుద్దాలకు వెళ్లిన సైనికులను రాత్రిళ్లు ఉత్తేజపర్చి వారిని మర్నాడు మళ్లీ కొత్తగా యుద్దాలు చేసేందుకు మానసిక ఉల్లాసం కలింగించేందుకు కళాకారులను తీసుకెళ్లేవారు. వారిలో కూడా కమేడియన్లు వుండేవారని సమాచారం. నవ్వుల ప్రపంచంలో మునిగి గాయల్ని మర్చి.. రాజ్యం కోసం యుద్దభూమిలోకి సైనికులు వెళ్లేవారట.

ఇక అలాంటి భోగాన్ని తెలుగు ప్రజలకు అందించిన ప్రముఖ కమేడియన్లలో అనతికాలంలోనే మంచి అభిమానులను సంపాదించుకున్న వారు ఎందరో. వారిలో ఇప్పటికీ ఆయనను తెరపై చూడగానే కడుపార నవ్వే కామేడియన్ల ఒకరు వేణు మాధవ్. అయితే అయను మాత్రం సత్యాన్వేషులుగా పేరొందిన పలు మాద్యమకర్తలు విపరీతంగా ఏడిపిస్తున్నాయి. ఆయనను, ఆయన అభిమానులను, వారి కుటుంబసభ్యులను విషాదంలో ముంచి.. వీరు నవ్వుతున్నారు. దీనిని ఏమంటారో మా కన్నా బాగా పాఠకులకే తెలుసు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకోకుండానే ఏకపక్ష కథనాలు, వార్తలతో కమేడియన్ ను అమరుడ్ని చేస్తున్నారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకుడదని, తాను ఎదుర్కోంటున్న దారుణ పరిస్థితి ఎంతటివారికైనా రాకూడదని అంటున్నారాయన.

తాను బతికే వున్నానని, తనపై అసత్య కథనాలు రాసి, రాసి వాటని నిజం చేయాలని భావించే వారు.. కనీసం ఇప్పటికైనా వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని అభ్యర్థిస్తున్నారు. ఒకసారి కాకుండా పదే పదే ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఇలాంటి అసత్య కథనాలపై విపరీతంగా ప్రచారం జరుగుతుందని.. వాటిలో కొందరు తన అభిమానులు తట్టుకోలేక తన తల్లికి ఫోన్ చేసి నిజమేనా..? అంటూ సంతాపాన్ని వెలిబుచ్చడం.. ఇలాంటి ఫోన్లు రోజుకు ఐదు వందల వరకు రావడంతో అందోళన చెందిన తన తల్లి అనారోగ్యానికి గురికావడం లాంటి పరిస్థితులను ఎదుర్కోన్నానని వేణుమాదవ్ చెప్పారు. ఇంకా ఆయన ఏం అన్నారో.. మీరే చూడండీ. ఇకనైనా సత్యాన్వేషులుగా వున్న జర్నలిస్టు మిత్రులు.. అసత్యకథనాలను ప్రచురించకండీ.. అంటూ ఆయన అసత్యకథనాలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలసి చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. సాటి మనుషులకు సాయం చేయకపోయినా పర్వాలేదు.. కానీ.. వారికి హాని చేయకండని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles