500 కోట్ల స్కాంలో కోహ్లీ పేరు కూడానా? | Virat Kohli’s Audi Sold To A Scamster

Virat kohli s audi sold to a scamster

Virat Kohli’s Audi R8 scamster, Call centre scam virat kohli, virat kohli name in call centre scam, kohli sagar thakkar, kohli shaggy, kohli Audi car to a criminal, Kohli thane call centre scam

Virat Kohli’s Audi R8 Worth Rs 2.3 Crores Sold To A Scamster At Rs 60 Lakhs.

500 కోట్ల స్కాంలో విరాట్ కోహ్లీ పేరు?

Posted: 11/01/2016 11:40 AM IST
Virat kohli s audi sold to a scamster

కంగారుపడకండి. అంత పెద్ద స్కాంకీ, కోహ్లీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ సెంటర్ నిందితుడితో మాత్రం లావాదేవీలు జరిగాయంట. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగానే ధృవీకరించారు. ఎలాగంటారా? అయితే ఇది చదవండి.

థానే కాల్ సెంటర్ స్కాం సూత్రధారి సాగర్ థక్కర్ అలియాస్ షాగీ గురించి విచారణ జరుపుతున్న పోలీసులకు ఓ విలువైన క్లూ దొరికింది. దాని ఆధారంగానే ఈ నేరంలో కోహ్లీ పేరు బయటికి వచ్చిందట. విషయం ఏంటంటే.. షాగీకి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెకు మనోడు ఆడీ ఆర్ 8 కారును గిప్ట్ గా ఇచ్చాడు. మంది కొంపలు ముంచాడు కదా! ఆ మాత్రం ఇస్తాడులే అనుకుంటున్నారా? ఇంతకీ ఆ కారు ఎవరిది అనుకుంటున్నారు? ఇంకెవరిది టీమీండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీదే.

call centre shaggy

2012 మోడల్ అయిన ఈ కారును ఈ మేలో సుమారు 60 లక్షలు చెల్లించి కోహ్లీ నుంచి షాగీ కొనుగోలు చేశాడంట. రోహ్ తక్ (హర్యానా) రిజిస్ట్రేషన్ ను చెందిన హెచ్ ఆర్ 26 బీ డబ్ల్యూ 0018 కారు గతంలో కోహ్లీ వాడిందేనని, దానిని కోహ్లీ  సుమారు రెండున్నర కోట్లకు కొనుగోలు చేసి, సెకండ్ హ్యాండ్ లో అమ్మేశాడని క్రైం బ్రాంచ్ తెలిపింది. అయితే మద్యవర్తి సాయంతోనే ఈ అమ్మకం జరిగిందని, కోహ్లీ షాగీని కలవటం కానీ ఎక్కడా జరగలేదని పోలీసులు నిర్ధారించారు కూడా. ఏదీ ఏమైనా ఇంత పెద్ద స్కాంలో కోహ్లీ హస్తం( కారు) ఉందంటే... ఖచ్ఛితంగా మీడియాకు పండగే కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Thane Call centre scam  Audi car  Shaggy  

Other Articles