జనం(సేన) కోసం పవన్ కల్యాన్ సంచలన నిర్ణయం Pawan Kalyan set to be voter in Eluru

Pawan kalyan set to be voter in eluru

pawan kalyan , janasena, west godavari, vote registration, voter enrollment, pawan kalyan voter enrollment, pawan kalyan janasena, pawan kalyan west godavari, pawan kalyan andhra pradesh, powerstar pawan kalyan, pawan kalyan vote, pawan kalyan to shift from hyderabad, pawan kalyan to shift to eluru, tollywood news

Jana Sena president Pawan Kalyan sent clear signals of his intent on playing a more active role in Andhra Pradesh politics by asking his cadres to prepare the ground for his registration as a voter in Eluru in West Godavari district.

జనం(సేన) కోసం పవన్ కల్యాన్ సంచలన నిర్ణయం

Posted: 11/01/2016 09:18 AM IST
Pawan kalyan set to be voter in eluru

జనసేన అధినేత.. సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. జనం తన బలం అని విశ్వసించిన ఆయన ప్రజలక కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు ఇప్పడు సంచలనాన్ని రేపుతున్నాయి. ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ కల్యాన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది తమకు పవన్ ఇచ్చిన దీవపాళి కానుక అంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తుండగా, మరికోందరు మాత్రం ఆయన నిర్ణయాన్ని స్వాగతించలేకపోతున్నారు. ఇంతకీ పవన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏమిటంటారా..?

గత రెండున్నరేళ్ల క్రితం పార్టీని స్థాపించిన సమయంలో తాను ఓట్ల కోసమే నోట్ల కోసమే పార్టీని స్థాపించలేదని, కేవలం తన పార్టీ ప్రజల సంక్షేమం కోసమేనని, పార్ట్  టైంగా మాత్రమే జనసేన అధినేతగా వుంటానని చెప్పిన ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాన్ ఓటు హక్కే ఈ చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఓటును.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నమోదు చేసుకునేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరికి చెందిన జనసేన పార్టీ నేతలు.. ఆయనను కలిసి.. తన ఓటు హక్కును ఏలూరుకు మార్చుకోవాలని విన్నవించడంతో దానిపై సానుకూలంగా స్పందించిన పవన్ తనకు అనువుగా ఉండేలా ఒక ఇంటిని కూడా చూడాలని ఆయన కోరారని సమాచారం. దీంతో ఆయన.. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీ అధికారపక్షం బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో తన ఓటును పవన్ నమోదు చేయించుకోవటం ద్వారా..భవిష్యత్ లో ఆయన చేయనున్న ‘రాజకీయం’ ఎంత సీరియస్ గా ఉండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదం.. ఇటు కాపు సంఘాల నేతల ఉద్యమం.. వీటితో పాటు తన అభిమానులు, జనసేన కార్యకర్తలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయంగా వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  west godavari  vote registration  enrollment  

Other Articles