స్కూల్ చిన్నారిని గొలుసుతో బంధించి మరీ... | Malaysian Woman locks 8-year-old daughter to lamp

Malaysian woman locks 8 year old daughter to lamp

Girl school miss punishment, Kuala Lumpur kid lamp for school missing, Malaysian mother cruel punishment to daughter, Woman locks 8-year-old daughter to lamp

Mother of an 8-year-old in Kuala Lumpur, Malaysia, thought the best way to discipline her child would be by shackling her to a lamp post on the street. The woman did so because the young girl gave her school a miss.

బడి ఎగ్గొట్టినందుకు భయానక శిక్ష...

Posted: 10/29/2016 01:54 PM IST
Malaysian woman locks 8 year old daughter to lamp

సరదాగా ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. చిన్నప్పుడు బడి ఎగ్గొట్టేందుకు మీరు ఏం చేసేవాళ్లు. ఏ తలనొప్పో, కడుపునొప్పో అని చెప్పి తప్పించుకునేవారేమో. ఇంకాస్త ముదురులు మహా అయితే ఉల్లిపాయలతో బలవంతపు జ్వరం తెప్పించుకుని ఎంచక్కా ఎగ్గొట్టి ఇంట్లో ఎంజాయ్ చేసి ఉంటారు. అవి వర్కవుట్ కాకపోతే పేరెంట్స్ బరిగెల బడిత పూజకు తలొగ్గి చచ్చినట్లు స్కూల్ కి వెళ్లాల్సిందే. బాల్య దశలో ఎవరైనా ఆ అనుభూతిని ఆస్వాదించి తీరాల్సిందే. బడి భయం అలాంటిది మరీ. అలాగే ఓ 8 ఏళ్ల చిన్నారి బడికి వెళ్లనని మారాం చేసింది. అంతే ఆ కర్కశ తల్లి ఏం చేసిందో చూడండి.

మలేషియా రాజధాని కౌలలంపూర్ లో జరిగిన ఘటన వివరాళ్లోకి వెళ్లితే... తన కూతురిని దండించేందుకు ఆ తల్లి అనూహ్యమైన దారిని ఎంచుకుంది. అపార్ట్ మెంట్ బయట ఓ స్థంభానికి గొలుసుతో బంధించింది. దానికి పెద్ద తాళం కప్ప వేసి ఇంట్లోకి వెళ్లి తన పనిలో నిమగ్నమైపోయింది. ఇక దారిన పోయే వారంతా ఆ చిన్నారిని చూస్తూ పోతున్నారే తప్ప ఏం జరిగిందో ఆరా తీసే ప్రయత్నమే చేయలేదు. కాసేపటికి భీతిల్లిపోయిన ఆ చిన్నారి ఏడ్వటం మొదలుపెట్టింది.

అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి(పాత్రికేయుడు కూడా) నోట్లో వేలితో, కంట్లో కన్నీటితో ఉన్న ఆ పాపను గమనించాడు. ఏం జరిగిందమ్మా? అంటూ ఆరా తీశాడు. ఆ పాప జరిగిందంతా చెప్పుకొచ్చింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించగా, తాళాలు లేకపోవటంతో వారు కూడా కాసేపు ఆ కఠిన తల్లి కోసం వెయిట్ చేయసాగారు. ఆపై ఆమె రాగానే ఇంకొసారి ఇలా చేస్తే కటకటాల వెనక్కి తోసేస్తామని వార్నింగ్ ఇచ్చి మరీ వదిలేశారు. అదే మన ఇండియాలో ఐతేనా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malaysian Woman  locks 8-year-old daughter  lamp  school missing  

Other Articles