రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్న ఇస్రో With 82 launches in a go, Isro to rocket into record books

With 82 launches in a go isro to rocket into record books

ISRO, ISRO multiple satellites launch, PSLV, Rakesh Sasibhushan, Antrix Corporation, India's Space Mission, Indian Space Research Organisation, GSLV, ISRO, Subbiah Arunan, PSLV, 2017, global history books, 82 foreign satillites

Indian space mission which will rocket instantly into global history books. If all goes well, on January 15, 2017, Isro will launch 82 foreign satellites in a daring single shot, Subbiah Arunan, the project director of Mars Orbiter Mission+ (MOM) said.

రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్న ఇస్రో

Posted: 10/29/2016 01:01 PM IST
With 82 launches in a go isro to rocket into record books

ఇప్పటికే పూర్తి స్వదేశీ సాంకేతిక సహకారంలో క్రయోజెనిక్ ఇంజన్ వినియోగంతో సరికోత్త అద్యాయాలను తన పేరున లిఖించుకుంటూ ముందుకు సాగుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) మరో కొత్త చరిత్రను సృష్టించేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటి వరకు ఏ దేశం చేయని అరుదైన కార్యానికి ఇస్రో నడుం చుట్టింది. ఒకే సారి శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా 82 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు సమాయత్తం అవుతుంది. వచ్చే ఏడాది జనవరి 15న ఈ ప్రయోగం చేయనున్నట్లు మార్స్ ఆర్బిటార్‌ మిషన్‌(మామ్) ప్రాజెక్టు డైరెక్టర్ సుబ్బయ్య అరుణన్ తెలిపారు.

ప్రపంచ దేశాలలో ఇప్పటివరకూ కేవలం రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపి ఒకసారి ప్రయోగం ద్వారా అత్యదిక ఉపగ్రహాలను నింగిలోకి పంపిన చరిత్రను తన పేరున లిఖించుకోగా, తాజాగా ఇస్రో దానిని బద్దలు కోట్టి.. తన పేరున నూతన అద్యాయం లిఖించుకునేందుకు సిద్దమైంది. రష్యా 2014లో 37 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగా. అంతకుముందు అమెరికా 29 ఉపగ్రహాలను పంపింది. అయితే గతంలో ఒక ప్రయోగంలోనే 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో.. ఈ సారి ఏకంగా 82 ఉపగ్రహాలను పంపేందుకు సన్నధం అవుతుంది.

ఇప్పటికే ఎన్నో ఘనవిజయాలను అందించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ)తో ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ప్రయోగం జరిగిన 20 నుంచి 25 నిమిషాల్లో 580కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ కక్ష్యలో 82 శాటిలైట్లను ప్రవేశపెట్టేంత వరకు దానిని అక్కడే అగేలా చేయడమే తమకు ఈ ప్రయోగంలో ఏర్పడనున్న ప్రధాన సవాల్ మామ్ ప్రయోగపరిశోధన డైరెక్టర్ గా వ్యవహరించిన  సుబయ్య అరుణన్ చెప్పారు. ఆ తరువాత 2020లో మామ్-2ను ప్రయోగించాలని నిర్ణయించినట్లు అరుణన్ వెల్లడించారు. అరుణ గ్రహంపై పరిశోధనలకు ఇప్పటివరకూ 40 ప్రపోజల్స్ వచ్చినట్లు చెప్పారు. చంద్రయాన్-2 2018లో చంద్రునిపై దిగుతుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమైనట్లు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  Subbiah Arunan  PSLV  2017  global history books  82 foreign satillites  

Other Articles