కేరళా కాలేజ్ డ్రెస్ కోడ్: లెగ్ ఇన్స్, జీన్స్, టాప్స్ పై నిషేధం.. Dress code in Medical College turns controversial

Kerala medical college dress code ban on jeans noisy ornaments

trivandrum medical college, kerala dress code, kerala college dress code, kerala medical college, college dress code, college dress code in kerala, ban on jeans, ban on leggings, MBBS course, Indian heritage, Indian culture

The Government Medical College in state capital Thiruvananthapuram has come under flak for issuing a dress code for girls prohibiting them from wearing jeans, leggings or ‘noisy ornaments’.

కేరళా కాలేజ్ డ్రెస్ కోడ్: లెగ్ ఇన్స్, జీన్స్, టాప్స్ పై నిషేధం..

Posted: 10/21/2016 02:51 PM IST
Kerala medical college dress code ban on jeans noisy ornaments

ఫాఠశాల విద్యార్థులకు పెట్టినట్లు కళాశాలలు కూడా డ్రెస్ కోడ్ లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. భారతీయ సంప్రదాయాన్ని మరచి విద్యార్థులు, విద్యార్థినిలు పాశ్చాత మోజులు అక్కడి వేషాధారణకు అధిక ప్రాధన్యమిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో విద్యార్థినీ విద్యార్థులకు డ్రెస్ కోడ్ ను అమలు చేసింది ఓ కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీ. విద్యార్థినీ విద్యార్థినులందరూ ఒకేలా వుండేలా ఒకే డ్రెస్ విధానాన్ని పాఠశాలల వరకే పరిమితం కాగా. కాళాశాల విద్యార్థినులు మాత్రం డ్రెస్ కోడ్ ను అమలుపరుస్తున్నారు.

మధురై మెడికల్ కాలేజీ ఇటీవల ఈ డ్రెస్ కోడ్ విధానాన్ని తమ విధ్యార్థినీ విద్యార్థులకు అమలుపర్చగా ఇప్పడు తాజాగా తిరువనంతపురం మెడికల్ కాలేజ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈ మేరకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ సర్క్యులర్ జారీ చేశారు. విద్యార్థినీ విద్యార్థులందరూ విధిగా తమ డ్రెస్ కోడ్ ను ఫాలో కావాలని అదేశాలను కూడా జారీ చేసింది. అయితే ఈ డ్రెస్ కోడ్ నిబంధనలను వీడిన వారిపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

తిరువనంతపురం మెడికల్ కాలేజీ తాజాగా ఇచ్చిన అదేశాల ప్రకారం మెడికల్ కాలేజ్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థినులు చుడీదార్లు, చీరలు ధరించే రావాలి. విద్యార్థులు సాధారణ (క్యాజువల్) ప్యాంట్లు, ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు, షూ కచ్చితంగా ధరించాలి. లెగ్గింగ్స్, జీన్స్ ధరించి కళాశాలకు రాకూడదు అని స్పష్టం చేశారు. కంఫర్ట్ పేరుతో చిత్రవిచిత్రమైన దుస్తులు ధరించే పద్దతికి స్వస్థి చెప్పడంలో భాగంగా డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్టు తెలిపారు.

కాగా తాము ప్రతీ ఏడాది డ్రెస్ కోడ్ నిబంధలను కొత్తగా కాలేజీలో చేరబోయే విద్యార్థులకు తెలియజేస్తూ సర్కులర్ పెడతామని కాళాశాల యాజమాన్యం తెలిపింది. అయితే ఇప్పటి వరకు తమపై విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ అభ్యంతరాలను తెలపలేదని, పిర్యాదలు కూడా చేయలేదని కూడా స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు మాత్రం కళాశాల జారీ చేసిన నిబందనలతో ఒకింత అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే బహిరంగంగా కాలేజీ యాజమాన్య నిబంధనపై ఎలాంటి నిరసనను ఇప్పటి వరకు తెలపలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Government Medical College  Thiruvananthapuram  dress code  jeans  leggings  noisy ornaments  

Other Articles