ఐదు రూపాయల ఐడియా అదుర్స్.. ప్రీ ఇంటర్నెట్ karnataka tea seller rocking idea changes his life

Chai pe data recharge with rs 5 tea and enjoy 30 minutes of free internet

Syed khadar basha, tea, data recharge, Basha, Siruguppa, wi-fi router, tea vendor, tea seller, internet, chai pe data, idea can change your life, Ballari, Karnataka

23-year-old Syed Khadar Basha of Ballari, a tea vendor, struck upon this idea to ensure more customers for his business. All he did was get a router and milk 'em

ఐదు రూపాయలకే ప్రీ ఇంటర్నెట్ ఐడియా అదుర్స్..

Posted: 10/21/2016 03:38 PM IST
Chai pe data recharge with rs 5 tea and enjoy 30 minutes of free internet

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అన్నది ఐడియా సెల్యూలార్ ప్రకటన మాత్రమే కాదు.. జీవిత సత్యమని నిరూపించాడు పదో తరగతితో విద్యాభ్యాసాన్ని అపేసిన యువకుడు. కేవలం ఐదు రూపాయలకు అరగంట పాటు ఉచిత ఇంటర్నెట్ ను అందిస్తూ.. తన వ్యాపార వృద్ది అంతర్జాలన్ని అస్త్రంగా మార్చుకున్నాడు. ఇంతకీ అతనెవరూ..? ఇంటర్నెట్ ను ఉచితంగా ఇస్తే తనకేంటి లాభం అంటారా..? అయితే ఆ యువకుడి గురించి మీకు తెలియాల్సిందే.. మ్యాటర్ లోకి వెళ్తే..

కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప గ్రామానికి చెందిన 23 ఏళ్ల సయీద్ ఖాదర్ బాషా.. స్థానికంగా చిన్న టీస్టాల్ నడుపుకొంటున్నాడు. అయితే తమ గ్రామంలోని జనాభాను, తోటి పోటీదారులను పరిగణలోకి తీసుకున్నా.. తన టీ స్టాల్ కు రోజుకు వంద ఛాయ్ లకన్నా అధికంగా అమ్ముడు పోవడం లేదు. తనకున్న పరిచయాలతో స్నేహితులను రమ్మనా.. వారు ఓసారి టీ తాగుతారే కానీ ప్రతీ రోజు తాగడం కష్టం. వీటిని అధిగమించాలంటే ఏం చేయాలి..? తన సంపాదనను ఎలా పెంచుకోవాలి అన్న అలోచనలో అతని మదికి ఒక ఐడియా వచ్చింది. అదే అతన్ని వార్తల్లో నిలిచేలా చేసింది.

ఆ ఐడియా ఏంటంటే.. తమ గ్రామంలోని యువకులందరూ స్మార్ట్ ఫోన్ ప్రియులే. అయితే అవి చూపించుకునేందుకే కానీ అందులో ఇంటర్నెట్ మాత్రం ఉండేది కాదు. దీనిని గ్రహించిన సయాద్ ఖాదర్.. తన గ్రామ యువకుల నేపథ్యం మేరకు వారికి ఉచితంగా ఇంటర్ నెట్ అందించాలని, నిర్ణయించుకున్నారు. అయితే తన వద్ద టీ తాగిన వారికి మాత్రమే ఈ ఆఫర్ ను కల్పించాడు. ఐద రూపాయల టీ తాగిన వారికి అరగంట పాటు ఫ్రీ ఇంటర్నెట్ పౌకర్యం కల్పించాడు.

ఇందుకోసం స్థానిక కేబుల్ ఆపరేటర్ ద్వారా తన టీస్టాల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని.. దానిని వై ఫై రూటర్ కు కనెక్ట్ చేసి.. తన వద్ద చాయ్ తాగే కస్టమర్లందరికీ 30 నిమిషాలపాటు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తున్నాడు. అయిదు రూపాయల టీ కొనుక్కున్న ప్రతిఒక్కరికీ వైఫై పాస్ వర్డ్ ఉంచిన కూపన్ ను ఇస్తాడు. అలా చాయ్ తాగుతూ డేటా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించాడు. ఒకప్పుడు రోజుకు 100 టీలు అమ్మిన బాషా.. సెప్టెంబర్ లో 'ఫ్రీ ఇంటర్నెట్' ఐడియా అమలుచేస్తున్నప్పటి నుంచి 500 టీలు అమ్మేస్తున్నాడు. నిజంగా ఈ ఐడియా అతని జీవితాన్ని మార్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : internet  tea seller  Syed Khadar Basha  Siruguppa  Ballari district  Karnataka  

Other Articles