బాగా చదువుకుంటే.. చితకబాదుడే..! Beaten up for being a Dalit, good student:

Beaten up for being a dalit good student

Kendriya vidyalaya, dalit student, gangster sons, thrash, teachers suspended, Bihar, Muzaffarpur, video, student thrashed, Bihar student thrashed, Bihar gangster, victim, school students thrashed victim, student, thrashed, muzaffarpur, school, gangster son, viral video, bihar, crime

The Kendriya Vidyalaya Sangathan suspended the principal of its school in Bihar's Muzaffarpur and transferred the Vice Principal along with 14 teachers in connection with the incident of two students mercilessly beating their Dalit classmate whose video went viral on social media.

ITEMVIDEOS: బాగా చదువుకుంటే.. చితకబాదుడే..!

Posted: 10/20/2016 01:06 PM IST
Beaten up for being a dalit good student

నాగరికత సమాజంలో అనాగరిక పోకడలకు పోతూ.. కులవృత్తుల సాక్షిగా వెలసిన కులాలనే ప్రమాణికాలుగా చేసకుంటూ.. ఇప్పటికే రాజకీయ నాయకులు వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అయితే చిన్న పిల్లలోనూ ఈ విషబీజాలు నాటి.. వారి చిన్నారి మనస్సులను కూడా కలుషితం చేస్తున్నారు. నువ్వు దళితుడివి, నువ్వు అధికంగా మార్కులు తెచ్చుకోకూడదు అంటూ బీహార్ లో ఓ దళిత విద్యార్థిని అతని తరగతి గదికే చెందిన ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా చితకబాదడం సమాజాన్ని వెక్కిరిస్తూ ప్రశ్నిస్తుంది. సభ్య సమాజంలో మనం ఎక్కడికి వెళ్తున్నామని వేలెత్తి చూపుతుంది.

బీహర్ లోని ముజఫర్ పూర్ లోని కేంద్రీయ విద్యాలయంలో తనను గ్యాంగ్ స్టర్ కోడుకులు విక్కీ, విశాల్ ఎందుకు చితక్కోట్టారన్న విషయన్ని.. దెబ్బలు తిన్న బాలుడు ఉత్తమ్ కుమార్ వెల్లడించాడు. కేంద్రీయ విద్యాలయలో చదువుతున్న తనను అకారణంగా విక్కీ, విశాల్ లు తమ స్నేహితులతో కలసి చావచితక్కోట్టారని గతంలో చెప్పిన ఉత్తమ్ కుమార్.. తనను వారు కొట్టడానికి తాను చదువులో బాగా రాణించడమే కారణమని చెప్పాడు. తనకు అధిక మార్కులు రావడం జీర్ణంచుకోలేని వారు తనను తరగతి గదిలోనే మరికొందరు విద్యార్థులు చూస్తుండగా దారుణంగా కొట్టారన్నారు.

తాను ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే చంపుతామని కూడా వారు బెదిరించారని చెప్పాడు. గతంలోనూ తనపై అకారణంగా వారు దాడి చేసినట్లు చెప్పాడు. తనను పరీక్షలు కూడా రాయకుండా అడ్డుకుంటామని బెదిరించడంతో తాను ఈ విషయాన్ని ఎవరకీ చెప్పలేదని ఉత్తమ్ కుమార్ చెప్పాడు. కాగా అగస్టు 25 జరిగిన ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. ఇన్నాళ్లుగా  గోప్యంగా వుంచడంపై స్థానిక పాఠశాల యాజమాన్యాంపై కేంద్ర మానవవనరులు శాఖ చర్యలు తీసుకుంది.

దళిత విద్యార్థిని చితకబాదిన ఘటనలో మొత్తం 15 మందిపై కేంద్ర మానవ వనురుల మంత్రిత్వ శాఖ వేటు వేసింది. కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్ ను సస్సెండ్ చేశామని, కాగా, ఉప ప్రధానోపాధ్యాయుడితో పాటు 14 మంది ఉపాధ్యాయులపై కూడా బదిలీ వేటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తన ట్విట్టర్ లో తెలిపారు. బీహర్ ముజాఫర్ పూర్ కేవీ పాఠశాలలో జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అయన పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kendriya vidyalaya  dalit student  gangster sons  thrash  teachers suspended  viral video  

Other Articles