‘‘ అమెరికా ఎన్నికలలో రిగ్గింగ్.. ట్రంప్ వ్యాఖ్యలకు బలం..’’ A $15 Device Can Hack US Presidential Election, Says Symantec

A 15 device can hack us presidential election says symantec

Donald Trump, us 2016 election, 2016 us polling, cyber-security firm Symantec, symantec rigging elections, hacking, republican party, democratic party, Barack Obama, hillary clinton, rigged election, bill clinton, hillary supporting media, america Us presidential elections

cyber-security firm Symantec has revealed three easy ways an attacker with the right level of intelligence and motivation could impact the US presidential election and it will cost just $15 (roughly Rs. 1,000).

‘‘ అమెరికా ఎన్నికలలో రిగ్గింగ్.. ట్రంప్ వ్యాఖ్యలకు బలం..’’

Posted: 10/20/2016 11:35 AM IST
A 15 device can hack us presidential election says symantec

అగ్రరాజ్యం అమెరికా పీఠం కోసం జరగనున్న తుదిపోరు ఎన్నికలలో రిగ్గింగ్ జరిగేందుకు అస్కారం భారీగా వుందన్న కథనాలు వెలువడుతున్నాయి. అధ్యక్ష రేసులో వున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన అరోపణలకు కథనాలు బలం చేకూర్చుతున్నాయి. అయితే రిగ్గింగ్ కు పాల్పడేది ఎవరి మద్దతుదారులన్నది తెలియకపోయినా.. ట్రంప్ కాస్తా ముందుగానే దీనిపై అందోలన వ్యక్తం చేస్తూ ప్రపంచ దృష్టిని మాత్రం అకర్షించారు. అమెరికాలో అత్యంత సంపన్న వర్గానకి చెందిన ట్రంప్ తన మద్దతుదారులతో రిగ్గింగ్ కు పాల్పడతారా..? అందుకనే ఈ అరోపణలు ముందుగానే ప్రత్యర్థి పైకి నెట్టివస్తున్నారా..? అన్న అనుమానాలు కలగక మానవు.

ఇక ముందునుంచి పేరు వినబడుతున్నా.. సాండర్స్ లాంటి దిగ్గజాలను చివరి క్షణంలో వెనక్కి నెట్టి చాపకింద నీరులా.. అంచాలను క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చి.. అగ్రరాజ్యం చరిత్రలోనే తొలి మహిళ అధ్యక్షురాలిగా బరిలో నిలిచిన హిల్లరీ తన అనుయాయువులతో ఈ చర్యలకు ఉపక్రమించేలా చేస్తారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక మరో ప్రశ్న ఏమిటంలే అసలు వీళ్లు పురమాయించకుండానే వారి వర్గీయులు అభిమానంతో ఇలాంటి చర్యలకు పాల్పడతారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు నవంబర్ 8 ఎన్నికలూ సమాధానం చెప్పాలి.

అయితే శాస్త్రసాంకేతికతలో అగ్రభాగన నిలిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరుగుతుందా.? అదెలా..? అయినా అంత డబ్బు ఎవరు ఖర్చుచేస్తారు అన్న సందేభాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అవును నిజమే.. సాంకేతికతో ముందువరుసలో నిలిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలోనూ రిగ్గింగ్ జరుగుతుందని, ఇందుకు అస్కారం లేకపోలేదని సైబర్ భద్రతా సంస్థ సెమాన్ టెక్ వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లు రిగ్గింగ్ ఎన్నికలంటూ రచ్చ చేసిన ట్రంప్ వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది. అది కూడా అత్యంత తక్కువ (కేవలం 15 డాలర్లు, అనగా సుమారు వెయ్యి రూపాయల) ఖర్చుతో రిగ్గింగ్ జరుగుతుందని తెలిపింది.

సాధారణంగా అమెరికా ఓటర్లు ఎన్నికలలో ఓట్లు వేసేందుకు వినియోగించే చిఫ్ కు రాస్ బెర్రీ పి-ఐ అనే చిన్న ఎటక్రానిక్ పరికరాన్ని వినియోగిస్తే చాలునని కూడా తెలిపింది. దీంతో ఓటు హక్కును వివనియోగించుకున్న వారి కోడ్ మరలా మరలా ఇతర ఓటర్లు వినియోగించే అవకాశం వుందని, సిమాన్ టెక్ సంస్థ తెలిపింది. అయితే క్రెడిట్ కార్డు ప్రోగ్రామింగ్ తెలిసిన వారు ఈ విధానాన్ని పోలింగ్ బూత్ లో సమయస్పూర్తితో అత్యంత వేగంగా వినియోగించాల్సి వుంటుందని తెలిపారు.

అమెరికన్ ఓటర్లు చిప్‌కార్డు ద్వారా ఓటుహక్కును వినియోగించుకుంటారు. చిప్‌లో క్రెడిట్‌ కార్డు తరహా వ్యవస్థ ఉండడంతో హ్యక్‌ చేసి అదుపులోకి తీసుకోవచ్చు. ఫలితంగా అదే కార్డును మరొకరు వినియోగించేట్లు చేయవచ్చని సియాన్‌టెక్ పేర్కొంది. తాము పరిశీలించిన ఓటింగ్‌ యంత్రంలో ఏదీ ఎన్‌క్రిప్షన్‌ రూపంలో లేకపోవడంతో ఇది మరింత తేలికవుతోందని పేర్కొంది. చిప్‌ కార్డ్ ప్రోగ్రాంను కార్టుతో రీసెట్ చేసి రెండుసార్లు ఓటింగ్‌కు వినియోగించేలా చేయొచ్చని.. అవసరమైతే రెండుసార్ల కంటే ఎక్కువగా కూడా వినియోగించే వీలుందని వెల్లడించింది.

ఇక ఓట్ల అక్రమాలకు పాల్పడేందుక మరో మార్గం ట్యాంపరింగ్. ఓన్నింగ్ యంత్రంలోని ట్యాబ్‌లేషన్‌లో మార్పులు చేసి కూడా రిగ్గింగ్‌ చేయవచ్చని ఆ సంస్థం వెల్లడించింది. సాధారణంగా ఓటర్ల సమాచారం మొత్తం పెన్‌డ్రైవ్‌ వంటి స్టోరేజి పరికరంలో ఎటువంటి ఎన్‌క్రిప్షన్‌ లేకుండా టెక్ట్స్‌ రూపంలో ఉంటుందని, దానిని తమ వద్ద వున్న డివైస్ లతో ఓటర్లు పొలింగ్ బూత్ లో టాంపరింగ్ చేసే అవకాశం కూడా లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేసింది. మరో పక్షం రోజుల వ్యవధిలో జరిగే అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలను నివారించేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. లేక పాత పద్దతినే పయనిస్తుందో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  symantec  hacking  tampering  chip card  us presidential elections  

Other Articles