పండగ వేళ.. వాహనదారులకు డీలర్ల షాక్..! Refueling stations dealers threaten strike

Refueling stations dealers threaten phase wise strike

All-India petrol dealers strike, telugu states petrol dealers stir, telangana petrol dealers stir, andhra pradesh petrol dealers stir, telugu states petrol bunk strike, petrol bunk strikes, all india petrol association, andhra pradesh petrol bunk, andhra pradesh news, india news

All-India petrol dealers to go on phasewise agitation for the perusal for following long-pending dealer demands.

పండగ వేళ.. వాహనదారులకు డీలర్ల షాక్..!

Posted: 10/19/2016 03:37 PM IST
Refueling stations dealers threaten phase wise strike

పండగ వేళ వాహనదారులకు పెట్రోల్ డీలర్లు షాక్ ఇవ్వనున్నారు. అంచెలవారీగా ఇవాళ్లి నుంచి ప్రారంభమవుతున్న వారి నిరసన కార్యక్రమాలలో భాగంగా పండగ పర్వదినాలలో సెలవులను స్వయంగా ప్రకటించుకుని పెట్రోల్ బంకులకు తాళాలు వేయనున్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా వున్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. పెట్రోల్ బంక్ డీలర్లు భారత్ బంద్ కు పూనుకుంటున్నారు. పదే పదే తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా వాటిని పరిష్కరించకుండా పెడచెవిన పెడుతుందని వారు అరోపిస్తున్నారు. 2012లో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగనున్నాయి.

పూర్తిగా పెట్రోల్ బంకులను మూసేసి వాహనదారులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యం తమకు లేదని, దీంతో ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లే క్రమంలో నిరసన కార్యక్రమాలు చేపడతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం ఏడు గంటల నుంచి 7.15 వరకు అమ్మాకాలను నిలిపేస్తామని, పెట్రోల్ బంకులులో లైట్లను కూడా అపివేస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఈ నెల 26 తేదీన కూడా ఇదే విధంగా నిరసన తెలుపుతామని చెప్పారు.

అలాగే నవంబర్ 3, 4 తేదీలలో ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని, నవంబర్ 5న సాయంత్రం 6గంటలకు పెట్రోల్ బంక్‌లు మూసివేయనున్నారు. నవంబర్ 6న పెట్రల్‌బంక్‌లు తెరవబోమని కూడా చెప్పారు. అలాగే ప్రతీ నెలా 2, 4 శనివారాలు, ప్రతీ ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో కూడా బంక్‌లు పనిచేయవు. అప్పటికీ ప్రభుత్వ దిగిరాని పక్షంలో నవంబర్ 7 నుంచి కేవలం ప్రభుత్వ కార్యాలయ వేళల్లోనే పెట్రోల్ విక్రయాలు జరుపుతామని వారు ప్రభుత్వానికి హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol bunks  dealers  telugu states  strike  india  

Other Articles