నెట్టింట్లో హల్ చల్: గాలి జనార్థన్ రెడ్డి కూతరి పెళ్లిపత్రిక.. Gali Janardhan Reddy's Big Fat Wedding Invite

Telugu content

gali janardhan reddy, brahmani reddy wedding invitation, invitaion card, bs yeddyurappa, bengaluru, karnataka

Gali Janardhan Reddy, former Karnataka minister in the BS Yeddyurappa government, has done something quite unique for his daughter’s wedding.

ITEMVIDEOS: గాలి వారి పెళ్లి అహ్వానపత్రిక అదిరింది గురూ..!

Posted: 10/19/2016 02:39 PM IST
Telugu content

ఓబుళాపురం గనులతో పాటు కర్ణాటకలోని పలు గనులలో అక్రమ మైనింగ్ పాల్పడ్డారని అభియోగాలతో పలు కేసులలో మోపబడిన నేపథ్యంలో కొన్ని నెలలు జైలు జీవితాన్ని గడిపి.. బైయిలుపై విడుదలయిన కర్ణాటక మాజీ మంత్రి, బీజేపి నేత గాలి జనార్ధన్‌రెడ్డి.. తన కూతురు బ్రహ్మణీ వివాహానికి గాను అహ్వానిస్తూ అతిధులకు పంపిన పెళ్లి పత్రికలు ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ పెళ్లి పత్రిక ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కొద్దిరోజుల క్రితమే గాలి జనార్ధన్‌రెడ్డి కూతురికి పెళ్లి నిశ్చయమైంది. గాలి వారింట పెళ్లంటే మాటలా. కూతురి పెళ్లిని చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని, ఊరూర చెప్పుకునేలా చేయాలని గాలి పట్టుదలతో ఉన్నారట. ఆకాశమంత పందిరేసి.. భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే పెళ్లి కార్డుల దగ్గర్నుంచి వేదిక దాకా అన్నీ జనార్థన్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారట.

దీంతో ప్రస్తుతం గాలి జనార్థనరెడ్డి కూతురి అహ్వాన పత్రిక సోషల్ మీడియాలో సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతలా ఏముంది..? ఈ కార్డుపై జాతీయ మీడియాలో కథనాలు ఏంటి అంటారా..? సాదాసీదా పెళ్లి కార్డులా వుండకూడదని భావించిన ఆయన.. తన కూతురి పెళ్లి అహ్వాన పత్రిక కోసం ఏకంగా ఒక బాక్స్ లో అమర్చి వైవిధ్యంగా తయారు చేయించారు. అంతేకాదు, ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఎదుటివారికి బహుచక్కిన వినూత్న అనుభవం ఏర్పడుతుంది.

అదేమిటంటే కార్డు తెరచి తెరవంగానే మీరు మా అమ్మాయి పెళ్లికి తప్పక రండీ అంటూ గాలి జనార్థన్ రెడ్డి కుటుంబసభ్యులు అహ్వానిస్తూ.. వీడియో ప్లే అవుతుంది. బ్రహ్మణి వెడ్స్ రాజీవ్ రెడ్డి అనే వధూవరుల పేర్లతో ఈ వీడియో మొదలవుతుంది. కార్డు పైభాగంలో వుంచిన ఎల్సీడీ స్క్రీన్ పై గాలి వారి పెళ్లి పాట మొదలవుతుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ నవంబర్‌ 16న జరగనుంది. పెళ్లి కార్డుతోనే ఇంత హంగామా చేసిన గాలి కూతురి పెళ్లిని ఇంకెంత ఘనంగా చేస్తారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh