అమ్మో..! కానుకలా నాకొద్దు బాబోయ్.. CM Siddaramaiah wary of gifts, after Hublot watch episode

Cm siddaramaiah wary of gifts after hublot watch episode

Karnataka CM, Hublot watch episode, Siddaramaiah, gifts, Bengaluru, silk kurtas, cabinet minister A Manju, Vidhana Soudha, Girish Chandra Varma, Dubai-based doctor, diamond stuffed wrist watch, controversy

After his bitter experience of receiving Hublot watch, Karnataka CM Siddaramaiah seems to be wary of receiving any gifts from anybody, including those from his own Cabinet colleagues!

అమ్మో..! కానుకలా నాకొద్దు బాబోయ్..

Posted: 10/19/2016 01:07 PM IST
Cm siddaramaiah wary of gifts after hublot watch episode

కానుకల ఇస్తే తీసుకోని వారెవరుంటారు..? కానుకలను తప్పని సరిగా తీసుకురావాలని, లేదా కానుకలను కేవలం క్యాష్ రూపంలోనే ఇవ్వాలని ప్రత్యేకంగా అర్థిస్తూ.. అ మేరకు తమ ఆహ్వాన పత్రికలోనూ ముద్రించే వారున్న ఈ రోజుల్లో కానుకలను వద్దు అని చెప్పేవారు ఎవరుంటారు. అయితే అరుదైన కానుకుతో కంటి మీద కునుకు కరువైన వారు కూడా లేకపోలేదు. ఇలాంటి వారి జాబితాలోకి వచ్చే వారే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.

తన మిత్రుడు ఇచ్చిన చేతి గడియారంతో తాను ఎదుర్కోన్న అనవసర రభసతో మనశ్శాంతి కరువై.. వాటిపై విపక్షాలకు సమాధానాలకు చెప్పలేక.. అనవసర తలనొప్పిని తెచ్చుకున్నారు. అటు విపక్షాలతో పాటు ఇటు సొంత పార్టీకి చెందిన నేతలు కూడా ఆయనను ముప్పుతిప్పలు పెడుతూ.. అయనపై ఏకంగా అధిష్టానానికి పిర్యాదు చేసి.. అయనను తొలగించాలని కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసింది. ఏసీబీ క్లీన్‌చిట్‌తో బయటపడిన ఆయన కానుకలు అంటేనే జంకుతున్నారు. ఇప్పడా వాచ్ కర్ణాటక విధాన సభ హాలులో ఏర్పాటు చేయబడి వుంది.

దీంతో కానుకులో ఇప్పటికే తలబొప్పికట్టిన నేపథ్యంలో కానుకలంటే సిద్దరామయ్యకు హడలిపోతున్నారు. సొంత పార్టీకి చెందిన వారి నుంచి మొదలుకుని తన మంత్రివర్గ సహచరులు తమ శాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన కానుకలను కూడా తీసుకునేందుకు అయన జంకుతున్నారు. ఎంతలా అంటే తన సహచర మంత్రి ఏ.మంజు ఇచ్చిన అందమైన గిఫ్ట్ ప్యాక్ చూసి ఆయన ఏకంగా షాక్ అయ్యారు. మంత్రి వివరణ ఇవ్వడంతో అందులో ఏమున్నాయని తెలుసుకున్న సిద్ధరామయ్య.. తాను సిల్క్‌ జుబ్బాలు  ధరించనని సున్నితంగా తిరస్కరించారు.

కాగా గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే హెబ్లేట్ లగ్జరీ వాచ్ సృష్టించిన పెను ప్రకంపనలను చల్లార్చేందుకు ఆయన చాలా శ్రమించాల్సి వచ్చింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే ఆయన ఇంత ఖరీదు చేసే వాచ్‌ను చేతికి పెట్టుకోవడంపై ప్రతిపక్ష నేత హెచ్.డి.కుమారస్వామి అప్పట్లో అనేక ప్రశ్నలను సంధించారు. దీంతో ఇంటా, బయట వాయింపులతో ఇరుకునపడ్డ సిద్దరామయ్య ఏసీబీ న్యాయస్థానం క్లిన్ చిట్ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి కానుకలు అంటేనే సిద్ధరామయ్య భయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka CM  Hublot watch episode  Siddaramaiah  gifts  Bengaluru  

Other Articles