సల్మాన్ ను మళ్లీ వెంటాడనున్న కృష్ణజింకల కేసు Rajasthan govt moves SC against Salman khan in blackbuck poaching case

Rajasthan govt moves sc against salman khan in blackbuck poaching case

Rajasthan govt, Salman Khan, blackbuck poaching case, Chinkara poaching case, Bollywood actor, Supreme Court, Salman Khan acquittal

The Rajasthan government has approached the Supreme Court against the acquittal of actor Salman Khan in two 18-year-old cases of deer poaching.

సల్మాన్ ను వీడనంటున్న కృష్ణజింకల కేసు

Posted: 10/19/2016 11:39 AM IST
Rajasthan govt moves sc against salman khan in blackbuck poaching case

మూగ జీవాల ఉసురు తీసినట్లు అభియోగాలు ఎదుర్కోంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు కష్టాలు వీడేలా లేవు. ఈ కేసులో ఆయనను నిర్ధోషిగా రాజస్థాన్ హైకోర్టు తీర్పును వెలువరించడంతో ఊరట పోందిన సల్మాన్ ఖాన్ కు మళ్లీ అదే కేసులో నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ నిర్ధోషిత్వాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించింది.

ఈ ఏడాది జూలై  25న రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అపీలుకు వెళ్లింది. అయితే రాజస్థాన్ ప్రభుత్వం అపీలును స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దీపావళి సెలవుల తరువాత తమ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటీషన్ పై విచారణను చేపట్టవచ్చునని రాజస్థాన్ అడ్వకేట్ జనరల్ శివమంగళ్ శర్మ తెలిపారు.

కాగా 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.  సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు.. భావద్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. సరైన సాక్షాలు లేవని సల్మాన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles