సౌధీ చట్టాల ముందు అందరూ సమానమే.. Saudi prince executed for murdering a compatriot

Saudi arabia executes one of its princes over shooting murder

Saudi Arabia, Capital punishment, royal family member execution, Prince Turki bin Saud al-Kabir execution, fatal gunfight, Saudi Arabia, Capital punishment, Prince, Rpyal family member, Turki bin saud al kabir, World news

Rare case involving a member of royal family sees Prince Turki bin Saud al-Kabir put to death in Riyadh over fatal gunfight at desert camp in 2014

సౌధీ యువరాజుకు ‘ఉరి’.. చట్టం ముందు అందరూ సమానమే..!

Posted: 10/19/2016 11:08 AM IST
Saudi arabia executes one of its princes over shooting murder


దేశాల్లోకెళ్లా కఠినాతి కఠినమైన శిక్షలు విధించే దేశంగా విమర్శలను ఎదుర్కోంటున్న సౌదీ అరేబియాలో చట్టాలను సరళతరం చేయాలని వినతులు వెళ్లువెత్తుతున్న వేళ.. అ దేశ యువరాజుకు కూడా అక్కడి న్యాయస్థానాలు అతిపెద్ద శిక్షను విధించాయి. దీంతో వేల మంది సౌదీ ప్రజల ప్రార్థనల మధ్య సౌదీ యువరాజును అ దేశ రాజధాని రియాద్ లో బహిరంగంగా ఉరి శిక్షను అమలు చేశారు.

సౌదీలోని ఏడారి క్యాంపులో అవేశానికి గురైన అ దేశ యువరాజు టర్కిబిన్ సౌద్ అల్ కబీర్‌ తన స్నేహితుడిపై కాల్పులకు తెగబడ్డాడని, యువరాజు జరిపిన కాల్పుల్లో అతని స్నేహితుడు అదెల్ అల్ మహ్మద్ మరణించాడు. దీంతో అతనిపై హత్యా నేరం కింద అభియోగాలు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అభియోగాలు ఎదుర్కోంటున్న యువరాజు అల్ కబీర్ ను దోషిగా తేల్చింది.

న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో క్రితం రోజు సౌదీ యువరాజు టర్కిబిన్ సౌద్ అల్ కబీర్‌కు రియాద్‌లో ఉరి శిక్ష అమలు చేశారు. తమ దేశానికి చెందిన రాజ కుటుంబంలోని వ్యక్తికి కూడా సామాన్య పౌరులకు మాదిరిగానే శిక్షలను విధించడంతో పాటు బహిరంగంగా వాటిని అమలు చేయడంతో సౌదీ చట్టాల ముందు సామాన్యులతో పాటు రాజకుటుంబికులు కూడా సమానమనే సందేశాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి పంపింది.

చట్లాలను తమకు అనుకూలంగా మార్చుకుని తమ వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న అనేక దేశాల పాలకులకు.. చట్టలాను చేయడం కాదు.. వాటిని అమలు చేయడంలో తమ కుటుంబికులకు కూడా ఎలాంటి మినహాయింపు లేకుండా అచరించడంలోనూ తమకు తామే సాటి అని సౌదీ ప్రభుత్వం రుజువు చేసుకుంది. రిశిక్ష అమలు చేసింది. ఓ యువరాజును ఉరితీయడం ఇప్పుడు సౌదీలో సంచలనంగా మారింది. రాజు ఉరితీతతో ఈ ఏడాది సౌదీలో మరణశిక్షకు గురైన వారి సంఖ్య ఏకంగా 134కు చేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Arabia  Capital punishment  Prince  Rpyal family member  Turki bin saud al kabir  

Other Articles