మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. Over 20 dead after bus falls into gorge in Ratlam of madhya pradesh

Over 20 dead after bus falls into gorge in ratlam of madhya pradesh

bus accident,bus falls into gorge,Ratlam,Madhya Pradesh,gorge,bus accident Madhya Pradesh,bus accident ratlam,ratlam bus accident,bus accident india,bus accident death, gorge, 20 dead, Bara Pathar area, namli, ratlam, madhya pradesh

Over 20 people died after a bus travelling from Ratlam to Mandsaur with over 40 people on board fell into a gorge in the Bara Pathar area of the town of Namli in the Ratlam district of Madhya Pradesh

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు..

Posted: 10/14/2016 02:13 PM IST
Over 20 dead after bus falls into gorge in ratlam of madhya pradesh

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రత్లాంలో జిల్లా నుంచి మాండ్‌స‌వుర్ వెళుతున్న ఓ బ‌స్సు.. నెమలి పట్టణానికి సమీపంలోని బారాపత్తర్ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటన సుమారు ఉదయం పదిన్నర గంటల సమయంలో చోటుచేసుకుంది. వర్షాకాలంతో లోయ ప్రాంతం అడుగున్న నీళ్లు వుండటంతో బస్సు ఏకంగా నీళ్లలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మరణించారని, మరో పది మంది క్షతగాత్రులయ్యారని పోలీసులు తెలిపారు.

ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా వున్న అస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు, ప్రమాద స్థలం నుంచి ఎనమిది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ బస్సు మమతా బస్సు సర్వీసుకు చెందిన ప్రైవేట్ బస్సుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

బస్సు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ వుండడటం అక్కడే వున్న మలుపు వద్ద కూడా నెమ్మదించకపోవడమే ప్రమాదానికి కారణమని పలువురు ప్రయాణికులు అరోపిస్తున్నారు, కాగా బస్సు టైర్ పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని, దాంతో బస్సు గుండ్రంగా తిరిగి లోయలోకి పడిపోయిందని మరికోందరు ప్రయాణికులు చెప్పారు. మఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న స్థానికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. బస్సును వెలికి తీసేందుకు పోలీసులు సహాయక చర్యలు చేప‌ట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus accident  gorge  20 dead  Bara Pathar area  namli  ratlam  madhya pradesh  

Other Articles