సీనీఫక్కీలో.. విద్యార్థుల క్లాస్ రూమ్ ఫైట్ Viral Video: Muzaffarpur students thrash classmate

Student thrashed in bihar school opens up says gangster s sons threatened to kill him

Bihar, Muzaffarpur, video, student thrashed, Bihar student thrashed, Bihar gangster, victim, school students thrashed victim, student, thrashed, muzaffarpur, school, gangster son, bihar, crime

The student, who was getting thrashed in the video that had gone viral, has now opened up and said that the bullies, who are sons of a dreaded gangster in Bihar, had threatened to kill him of he reported the matter.

ITEMVIDEOS: సీనీఫక్కీలో.. విద్యార్థుల క్లాస్ రూమ్ ఫైట్

Posted: 10/14/2016 07:14 PM IST
Student thrashed in bihar school opens up says gangster s sons threatened to kill him

సినిమాల ప్రభావం పాఠశాల విద్యార్థులు ఎంత వుంటుందో చాటి చెబుతున్న వీడియో ఇది. మరోలా చెప్పాలంటే విద్యార్థులపై సినీమాల ప్రభావానికి పరాకష్ట ఇది. సినీమాల్లో గుండాల మాదిరిగా అ పాఠశాల విద్యార్థులు కూడా తమ తోటి విద్యార్థి పట్ల అలాగే వ్యవహరించారు. తరగతిగదిలోనే గుండాల తరహాలో వ్యవహరిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విద్యార్థిని టార్గెట్ చేసి కొందరు విద్యార్థులు చితకబాదుతున్న ఈ వీడియోను కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

అనంతరం.. సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులకు చేరేంతవరకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాలంటూ ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఇది విపరీతంగా షేర్ అవుతోంది. దీంతో ఈ వీడియోలో దెబ్బలు తిన్న బాలుడు ఉత్తమ్ కుమార్.. వారి తల్లిదండ్రులతో కలసి పోలీసులను అశ్రయించాడు. తాను ముజఫర్ పూర్ లోని కేంద్రీయ విద్యాలయలో చదువుతున్నానని , కాగా తన క్లాసులో వున్న గ్యాంగ్ స్టర్ పుత్రులు అన్నదమ్ములైన విక్కీ, విశాల్ తనను చితకబాదారని చెప్పాడు. వారి తండ్రి కూడా ప్రస్తుతం మోటీహరి జైలులో వున్నాడని చెప్పాడు,

తాను ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే చంపుతామని కూడా వారు బెదిరించారని చెప్పాడు. గతంలోనూ తనపై అకారణంగా వారు దాడి చేసినట్లు చెప్పాడు. తనను పరీక్షలు కూడా రాయకుండా అడ్డుకుంటామని బెదిరించడంతో తాను ఈ విషయాన్ని ఎవరకీ చెప్పలేదని ఉత్తమ్ కుమార్ చెప్పాడు. కాగా అగస్టు 25 జరిగిన ఈ ఘటనను ఇన్నాళ్లుగా ఎందుకు గోప్యంగా వుంచారని జేడీయు అధికార ప్రతినిధి అజయ్ అలోక్ ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్ కూడా మొత్తం అంశాన్ని గుట్టుగా వుంచేందుకు ప్రయత్నించారని, అమెపై కూడా కేంద్రమానవ వనరుల శాఖ చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student  thrashed  muzaffarpur  school  gangster son  bihar  crime  

Other Articles