సంజీవని తీసుకువస్తూ మారుతి వేషధారి మృతి.. నెట్టింట్లో వీడియో సంచలనం.. Artist dies while enacting Hanuman on stage in Rajasthan

Artist playing lord hanuman dies at ram leela video goes viral

dassehra, ram, ravan, hanuman, ramleela artist, ram dellu, bikaner, rajasthan, Ramleela, Ramleela artist, Bikaner, Rajasthan, Artist dies, Sanjeevani, Ravana, Dussehra celebration, Dhanna Ram Dellu, viral video

Take a look at the tragic footage that shows how an artist portraying a role of Lord Hanuman had to lose his precious life during Ram Leela event being conducted at Bikaner in Rajasthan.

ITEMVIDEOS: ప్రమాదంలో మృతిచెందిన హనుమంతుడు..! నెట్టింట్లో వీడియో సంచలనం..

Posted: 10/14/2016 12:56 PM IST
Artist playing lord hanuman dies at ram leela video goes viral

శీర్షక చూసి పవన కుమారుడు హనుమంతుడు అనగానే శ్రీరామచంద్ర మహాప్రభు కరుణకటాక్షంతో చిరంజీవియైన అ దేవదేవునకు, సాక్షాత్ పరమ శివుడి అవతారమైన అయనకు మరణం సంభవించడమేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుందా..? అయితే హనుమంతుడి అవతారంలో సుమారుగా నాలుగు దశాబ్దాలుగా మెప్పించిన నటుడు ధన్నా రామ్ డెల్లూ అనే కళాకారుడు దసరా పర్వదినాన అసువులు బాసాడు. పండగను పురస్కరించుకుని రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలోని లూన్కరన్సర్ అనే చిన్నపట్టణంలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో నిర్వహించిన రామ్ లీలా నాటకంలో అకస్మాత్తుగా ఆయన మరణించాడు.

అత్యంత ఆనందోత్సాహాల నడుమ 'రామ్ లీల' ప్రదర్శన సాగుతుండగా, జరిగిన విషాదకర ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 61 ఏళ్ల ధన్నా రామ్ డెల్లూ, హనుమంతుడి వేషం వేసి, ఓ భవంతి ఎక్కి, అక్కడి నుంచి ఇరువైపులా నిప్పులతో తాళ్ల సాయంతో కిందకు జారుతూ, లంకాదహనానికి కదులుతున్న వేళ, పట్టుతప్పి కిందపడి చనిపోయాడు. వెంటనే రామ్ డెల్లూను స్థానికంగా వున్న అస్పత్రికి తరలించగా అప్పటికే అయన మరణించాడని వైద్యులు తెలిపారు.

సుమారు 50 అడుగుల ఎత్తు పైనుంచి పట్టుతప్పి పడిపోవడంతో అయన ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారని రామ్ డెల్లూ అభిమానులు తెలిపారు. నలభై ఏళ్లుగా హనుమంతుడి వేషాధరణలో స్థానికులను అలరిస్తున్న రామ్ డెల్లూ అకస్మిక మృతికి సంతాపంగా పలువురు అభిమానులు పండగను కూడా జరపుకోలేదని సమాచారం. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోను ఆసాంతం ఎవరో చిత్రకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dassehra  ram  ravan  hanuman  ramleela artist  ram dellu  bikaner  rajasthan  viral video  

Other Articles