దేశవ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు.. nation celebratrates dussehra for victory of good over evil

Nation celebratrates dussehra for victory of good over evil

dussehra, dussehra 2016, dussehra 2016 date, vijaya dashami, dasara, dasara 2016, vijaya dashami 2016, dussehra images, dasara images, dasara festival, dasara date, dussehra 2016 date in india, dussehra celebration, vijaya dashami images, vijaya dashami date, dussehra festival, dussehra festival 2016, dussehra quotes, dussehra celebration in india, dussehra news, dussehra sms, dussehra messages, dussehra greetings

Dussehra is finally here. Across India, effigies of Ravan are being prepared for that symbolic final battle wherein good triumphs over evil, and the Lankeshwar Ravan is killed by the god Ram.

దేశవ్యాప్తంగా ఘనంగా దసరా పండగ సంబరాలు

Posted: 10/11/2016 07:16 AM IST
Nation celebratrates dussehra for victory of good over evil

దేశవ్యాప్తంగా ప్రజలు విజయదశిమి పండగ పర్వదినాన్ని ఇవాళ జరుపుకుంటున్నారు. తెల్లవారు జామునే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజల కోసం క్యూ కట్టారు. అటు దేశవ్యాప్తంగా పలు పవిత్ర పుణ్యక్షేత్రాలలకు భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రులు ముగిసిన నేపథ్యంలో ఇవాళ రాజరాజేశ్వరి మాతా అలంకరణలో దర్శమిచ్చే అమ్మవారికి భక్తులు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. కాశ్మీర్ లోని వైష్టోదేవి అలయంతో పాటు కలకత్తాలోని మహాకాళీ ఆలయంలో భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు,

ఇటు తెలుగు రాష్ట్రాల్లో దసర సంబురాలు మొదలయ్యాయి. ఈ ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రాకతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిజరూప అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వరీ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. శ్రీరాజరాజేశ్వరీదేవిగా కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తున్నారు. సాయంత్రం అమ్మవారు కృష్ణా నదీ విహారం చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నేటి నుంచి తిరు కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీభూసమేత శ్రీమహావిష్ణు అలంకారంలో స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.

ఇక సాయంత్రం రావణాసురుడిని దహనకార్యక్రమాల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో రావణాసురుడి దిష్టిబొమ్మలను తయారు చేసి వాటికి రకరకాల బాంబులను పోందుపర్చుకుతున్నారు. రాముడి భాణం వదలగానే రావణాసురుడు దహనమవుతున్న సమయంలో దానిని చూసేందుకు భక్తులు అదిక సంఖ్యలో వస్తారని అందుకని బాంబులతో మేలవితం చేసి అకర్షణీయంగా అవి క్రమపద్దతిలో దహణమయ్యేలా చూస్తారు. ఇక పోరుగు రాష్ట్రం కర్ణాటకలోని మైసూరులో రాజకుటుంబం అనావాయితీల మేరకు దసరా సంభరాలను, వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijaya dashami  dasara  celebrations  nation  hindus  nation wide festival  

Other Articles