ప్రభుత్వ భవనంలో నక్కిన ఉగ్రవాదులు Terrorists attack government building in Pampore

Encounter underway at edi building in pampore one jawan injured

kashmir, pampore, fidayeen attack, srinagar attack, terrorist attack pampore, terrorist attack srinagar, terror attack kashmir, j&k, jammu and kashmir, pampore building attacked, pampore fidayeen attack

An encounter between militants and security forces took place in the premises in February this year which lasted for more than 48 hours.

ప్రభుత్వ భవనంలో నక్కిన ఉగ్రవాదులు.. కొనసాగుతున్న కాల్పులు

Posted: 10/10/2016 02:48 PM IST
Encounter underway at edi building in pampore one jawan injured

లక్ష్యిత దాడుల అనంతరం భారత్ పై ప్రతీకారంతో రగలిపోతున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్రమంగా భారత్ లోకి చోరబడ్డారు. జమ్మూకాశ్మీర్ లో తలదాచుకున్నట్లు సమాచారంతో స్థానికంగా కలకలం కొనసాగుతోంది. పాకిస్థాన్ నుంచి ఓ నాటు పడవలో అక్రమంగా వచ్చిన ఉగ్రవాదులు సరాసరి పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లోని ఓ ప్రభుత్వ భవనంలో నక్కారు. జమ్మూకశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు.. కాంప్లెక్స్‌కు గల అన్నిదారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు భవనంలో నక్కి ఉండవచ్చని భారత బలగాలు అనుమానిస్తున్నారు. భవనంలో కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఒక భారత జవాను గాయాలపాలయ్యాడని అధికారులు తెలిపారు. భవనంలో నక్కిన ఉగ్రవాదులు ఇంకా బయటకు రాలేదు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  terrorists  indian army  fidayeen  srinagar  simhapuri area  jammu and kashmir  

Other Articles