సెయింట్ లూయిస్ డిబేట్ లోనూ హిల్లరీదే అధిక్యం.. Winners and losers from the second presidential debate

Winners and losers from the second presidential debate

second presidential debate, us elections 2016, hillary clinton vs donald trump, donald trump video, hillary clinton presidential debate, who won presidential debate

The debate was crammed with moments that could at best be described as petty and at worse vicious - as the candidates traded personal attacks and sarcastic one-liners

సెయింట్ లూయిస్ డిబేట్ లోనూ హిల్లరీదే అధిక్యం..

Posted: 10/10/2016 02:51 PM IST
Winners and losers from the second presidential debate

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల బరిలో నిలిచిన ఇద్దరికీ మధ్య సెయింట్ లూయిస్ వేదికగా సెకండ్ డిబేట్ జరిగింది. అయితే ఈ డిబేట్ లోనూ డెమెక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మహిళలపై దారుణ వ్యాఖ్యలకు సంబంధించిన టేపులు బయటకు వచ్చిన తరువాత జరిగిన ఈ డిబేట్ లో అత్యధికమంది అమెరికా జనాలు హిల్లరీకే అండగా నిలువగా, అయన మాత్రం తొలి డిబేట్ కన్నా సుమారుగా 7శాతం మంది మద్దతు అధికంగానే పోంచారు.

ఈ డిబేట్ లో హిల్లరీకి 57శాతం మంది మద్దతు పలుకగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు 34శాతం మంది అండగా నిలిచారు. తొలి డిబేట్ లో హిల్లరీకి 62 శాతం మంది మద్దతు పలుకగా.. ట్రంప్ కు కేవలం 27శాతం మందే మద్దతిచ్చారు. తొలి డిబేట్ తో పోలిస్తే రెండో డిబేట్ లో హిల్లరీ ఆధిక్యం కొంత తగ్గినప్పటికీ.. ట్రంప్ పై స్పష్టమైన ఆధిక్యం సంపాదించారు. మహిళల పట్ల దారుణంగా లైంగిక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ వీడియో వెలుగులోకి రావడంతో ఈ విషయంలో ఆయను తీరును హిల్లరీ తూర్పారబట్టారు. ఆయనకు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, ట్రంప్ కు అధ్యక్షుడయ్యే అర్హత లేదని విరుచుకుపడ్డారు.

మరోవైపు ట్రంప్ కూడా హిల్లరీపై ఎదురుదాడి చేశారు. హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మహిళలపై లైంగిక దాడులు జరిపారని ఆరోపించారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన రెండో డిబేట్ పై  ప్రజాభిప్రాయ సేకరణలో హిల్లరీకే అధిక మద్దతు లభించింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిల్ తమపై అత్యాచారం జరిపాడని ముగ్గురు మహిళలు ఆరోపించగా.. తాను బాలికగా ఉన్నప్పుడు అతను తనపై లైంగిక దాడి జరిపాడని మరో మహిళ ఆరోపించింది. ఈ నలుగురు మహిళలు చాలా ధైర్యవంతులని, వారికి అండగా నిలబడటం గౌరవంగా భావిస్తున్నానని రిపబ్లికన్ అభ్యర్థఇ ట్రంప్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us presidential elections  donald trump  Hillary Clinton  second Debate  

Other Articles