ఇంద్రకీలాద్రి దుర్గమ్మ విఐపీ దర్శనం టికెట్ల నిలిపివేత Indrakeeladri VIP darshan tickets on hold

Indrakeeladri vip darshan tickets on hold

Indrakeeladri, durgamma, dasara, VIP darshan, Rs 500 tickets. dassera sharannavtri, vijayadashimi

vijayawada kanakadurgamma temple also known as Indrakeeladri temple, officals have stoped selling VIP darshan tickets as per orders issued from higher authorities.

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ విఐపీ దర్శనం టికెట్ల నిలిపివేత

Posted: 10/09/2016 03:56 PM IST
Indrakeeladri vip darshan tickets on hold

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అన్ని అలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నాయి, అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులుసంచలన నిర్ణయం తీసుకున్నారు, అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అనేక మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. కాలతీతం కాకుండా వుండేందుకో, లేక అనారోగ్యం కారణంగానే క్యూలైన్లలో నిల్చోలేక శీఘ్రదర్శనం కోసం విక్రయిస్తున్న రూ.500 వీఐపీ టికెట్ల మార్గాన్ని ఎంచుకుంటారు,

అయితే ఈ టిక్కెట్ల విక్రయాలను అధికారులు నిలిపివేశారు. ఆదివారం ఉదయం నుంచి ఈ టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని ఆలయ అధికారులు ఆదేశించినట్లు కౌంటర్లలో సిబ్బంది చెబుతున్నారు. శనివారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలువురు భక్తులు టికెట్ల ధరలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టికెట్ల ధరలు పెంచడాన్ని ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీతో పాటు పలు ఆధ్యాత్మిక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ విషయం కూడా సీఎం దష్టిలో ఉండటంతో రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles