ఉగ్రనేతలకు పాకిస్తాన్ అర్మీ రక్షణ Terror masterminds moved to Pakistan Army camp

Terror masterminds hafiz saeed syed salahuddin moved to pakistan army camp

hafeez sayeed, Jamaat-ud-Dawa (JuD), Lashkar-e-Taiba, Hafiz Saeed, terror groups, Pakistan, Syed Salahuddin, Hafiz Muhammad Saeed, Hizbul Mujahideen, Pak Army, Hafiz shifted to Army camp

Rattled by India's surgical strikes, Pakistan has moved 26/11 mastermind Hafiz Saeed and Hizbul Mujahideen chief Syed Salahuddin to the camp of Army's 4 Corps.

ఉగ్రనేతలకు పాకిస్తాన్ అర్మీ రక్షణ

Posted: 10/09/2016 01:53 PM IST
Terror masterminds hafiz saeed syed salahuddin moved to pakistan army camp

లక్ష్యిత దాడులతో  పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్ లోకి చోచ్చుకెళ్లి.. పక్కగా దాయాధి ప్రేరేపిత ఉగ్రవాదలును మట్టబెట్టిన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు వారి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడుల నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదలతో పాటు, ఉగ్రవాద సంస్థల అగ్రనాయకులు, పాకిస్థాన్ ఆర్మీ కూడా భయపడిపోతోందనేది స్పష్టమైపోయింది. లష్కర్ ఎ తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలకు నేతృత్వం వహిస్తున్న హఫిజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్‌లకు పాక్ ఆర్మీ రక్షణ పెంచింది.

స్వయంగా వారిని తమ సైనిక స్థావరాల్లో భద్రత కల్పించింది. ఫోర్ కార్ప్స్ ఆర్మీ క్యాంప్‌లో వీరికి రక్షణ కల్పించారు. భారత బలగాల మెరుపుదాడిలో లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చనిపోయారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఇద్దరు అగ్ర ఉగ్రవాద నేతలను పాక్ ఆర్మీ క్యాంపులకు మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత బలగాలు మళ్లీ కనుక మెరుపుదాడులు నిర్వహిస్తే ఈ ఇద్దరు ఉగ్రనేతలకు ప్రాణహాని ఉంటుందని అనుమానించిన పాక్ ఆర్మీ వీరిని సురక్షిత స్థావరాలకు తరలించింది. ఉగ్రనేతలకు స్వయంగా ఆర్మీ రక్షణ కల్పించడం పాక్ తీరును మరోసారి బయటపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syed Salahuddin  Lashkar-e-Taiba  Hafiz Muhammad Saeed  Hizbul Mujahideen  Pak Army  

Other Articles