మోనికా హత్యకేసులో నిందితుల గుర్తింపు ATM Withdrawals Led To Arrest Of Perfumer's Murder Accused

Atm withdrawals led to arrest of perfumer s murder accused

Monika Ghurde,Monika Ghurde Murder,Perfumer Murder,perfumer goa murder,Goa perfumer,goa perfumer murder,ghurde murder,accused arrested in ghurde murder,ghurder murder accused,monika ghurde murder accused,Monica Ghurde,Monica Ghurde murder

The Goa police claims to have cracked the case of the murder of a perfume specialist who was found dead in her apartment

మోనికా హత్యకేసులో నిందితుల గుర్తింపు

Posted: 10/09/2016 07:52 AM IST
Atm withdrawals led to arrest of perfumer s murder accused

గోవాలో పెను సంచలనం సృష్టించిన పర్ఫ్యూమర్ డిజైనర్ మోనికా గర్డే హత్యలో పోలీసులు నిందితులను గుర్తించారు. మృతురాలికి చెందిన ఏటీయం కార్డును దొంగలించిన నిందితులు సంఘటనా స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఓ ఏటీఎం కేంద్రం నుంచి డబ్బు డ్రా చేశారు. అయితే ఈ క్రమంలో ఏటీయం కేంద్రంలో వున్న సీసీటీవీ కెమెరా వారిని బంధించింది. అదే ఏటీఎంతో మరోసారి బెంగళూరులో డబ్బు డ్రా చేసినట్లు గుర్తించారు. అయితే, ఆ ఇద్దరు ఎవరనే విషయాన్ని మాత్రం పోలీసులు ఇంతవరకు అధికారికంగా బయటకు చెప్పడం లేదు.

ఇప్పటికే గోవాలోని పోలీసు బృందం నిందితులకోసం బెంగళూరుకు బయలుదేరింది. ఇప్పటికే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. గోవాలోని తన ఫ్లాట్ లో మోనిక హత్యకు గురైన విషయం తెలిసిందే. వివస్త్రను చేసి చేతులు కట్టేసి మరీ నిందితులకు ఈ హత్యకు పాల్పడ్డారు. ఆ దృశ్యాన్ని బట్టి ఆమెపై లైంగికదాడి కూడా జరిగిఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, పోస్టు మార్టం నివేదికలో ఆమెకు ఊపిరి ఆడకుండా చేయడం వల్ల చనిపోయిందని తెలిసింది.

అయితే, ఆమెపై లైంగిక దాడి విషయంలో వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆమె శరీరంపై కొన్ని గుర్తులను గమనించిన గోవా మెడికల్ కాలేజీ వైద్యులు ఒక నిర్దారణకు రాలేకపోయారు. దీంతో మరింత స్పష్టతకోసం హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కాగా, ఆమెకు తెలిసిన వాళ్లే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసును పరిష్కరిస్తామని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goa  perfumer designer  Monika Ghurde  killer cctv footage  ATM camera  bengaluru  crime  

Other Articles