ట్రంఫ్ క్షమాపణలను అంగీకరించండీ: భార్య అభర్యన Melania Trump Responds to Donald Trump's Tape

Melania trump urges voters to accept husband s apology

apology, Melania Trump, Christine Todd Whitman, us presidential elections, donald trump, republican party candidate, lewd comments on women, video evidence, appology, Hillary clinton, bill clinton, democratic candidate

Donald Trump's wife blasted lewd remarks about groping women shortly after he married her in 2005 as "unacceptable and offensive," but urged the public to accept his apology.

ట్రంఫ్ క్షమాపణలను అంగీకరించండీ: భార్య అభర్యన

Posted: 10/09/2016 08:49 AM IST
Melania trump urges voters to accept husband s apology

అమెరికాలోని వైట్ హౌజ్ లోకి అడుగు పెట్టాలని కలల కంటున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అశలపై అడియో టేపు నీళ్లు చల్లుతుంది. సుమారు పదేళ్ల క్రితం మహిళల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడిన అడియో టేపు బయటపడిన నేపథ్యంలో అయన క్షమాపణలు చెప్పినా కలిసివచ్చేలా కనబడటం లేదు, దీంతో ఈ వివాదం నుంచి అయనను గట్టున పడేసేందకు ఆయన భార్య మెలానియా ట్రంప్ రంగంలోకి దిగారు. అది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రైవేటు సంభాషణ అని.. తన కన్నా బిల్ క్లింటన్ మహిళలను అవమానించేలా గోల్ఫ్‌ కోర్స్‌లో మాట్లాడారని.. కాగా తన మాటలకు ఎవరైనా బాధపడితే మాత్రం తాను క్షమాపణలు కోరుకుంటున్నట్లు తెలిపారు.

ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ కు చెందిన వాళ్లు కూడా ఆయన క్షమాపణలను ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇద్దరు అమ్మాయిలకు తాతగా.. ట్రంప్ మహిళల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు క్షమాపణలు చెప్పినా తాను వాటిని అంగీకరించలేనని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడిన జెబ్ బుష్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా మండిపడ్డారు. ''ఇది దారుణాతి దారుణం ఇలాంటి వ్యక్తి అధ్యక్షుడు అవ్వడానికి మనం అంగీకరించలేం'' అని ఆమె చెప్పారు. ఇలాంటి ప్రవర్తన హేయమని డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి సెనేటర్ టిమ్ కైన్ అన్నారు.

దీంతో ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా వైదోలగాలన్న డిమాండ్ తెరపైకి వస్తుండటంత.. ఆయన భార్య మెలానియా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. తన భర్త చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లూ తప్పేనని చెప్పిన ఆమె, ఆ వ్యాఖ్యలు గర్హనీయమని, అయితే, అవి 11 సంవత్సరాల క్రితం మాటలని గుర్తు చేశారు. ఆ కామెంట్లకు ఆయనే స్వయంగా క్షమాపణలు చెప్పారని, ఇప్పుడు తన భర్త పాత మనిషి కాదని, నాయకత్వ లక్షణాలను పెంచుకున్నారని తెలిపారు. సహృదయంతో క్షమాపణలు స్వీకరించి వివాదానికి స్వస్తి పలకాలని కోరారు.

ఈ నేపథ్యంలో మరో రిపబ్లికన్ పార్టీ నేత, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్టీన్ టాడ్ వైట్మేన్ తన ఓటును హిల్లరీ క్లింటన్కే వేస్తానని చెప్పింది. ట్రంప్ మరో హిల్లర్ లా తయారయ్యారని అయన అడవారి పట్ల మాట్లాడిన తీరు దీనిని బహిర్గంత చేస్తుందని అన్నారు, అయితే హిల్లరీ ఖాతాలో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయని, అయితే, వాటిని అదిగమించి పరిపాలనకు ఆమె సిద్ధమైందని అన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఒక హిట్లర్ లాంటివాడని ఆమె ఆరోపించారు. క్లింటన్ మాత్రమే అమెరికన్లకు ఉన్న ఏకైక ఛాయిస్ అన్నారు. ట్రంప్ గురించి ఆలోచిస్తే ఓ నియంతే గుర్తుకొస్తారని, ఆయనను ఎలాంటి నియంతలతోనైనా పోల్చేందుకు వెనుకాడబోమని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles