కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధిక్కార పిటీషన్లు వేయండి: ‘సుప్రీం’ SC disgusted with government inaction on drought relief

Supreme court disgusted with government inaction on drought relief contemplates contempt proceedings

Supreme Court of India, Drought Relief, Justice Madan Lokur, Justice N.V. Ramanna, Additional Solicitor General P.S.Narasimha, Swaraj Abhiyan, MNREGA, Supreme Court, drought, states, union government, contempt of court

Coming down heavily on the Central and State Governments for their willful disregard of the Supreme Courts’ May verdict on drought relief.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధిక్కార పిటీషన్లు వేయండి: ‘సుప్రీం’

Posted: 10/06/2016 09:56 AM IST
Supreme court disgusted with government inaction on drought relief contemplates contempt proceedings

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోని కేంద్రంతో పాటు 12 రాష్ట్ర ప్రభుత్వాలపై ధిక్కార పిటీషన్లను వేయాలని ఉన్నత న్యాయస్థానం స్వరాజ్ అభియాన్ సంస్థను అదేశించింది. తమ అదేశాలను పట్టించుకోని వ్యక్తులు, ప్రభుత్వ అధికారులను గుర్తించి వారి పేర్లను జతచేస్తూ ఈ పీటీషన్లను వేయాలని సూచించింది. దేశంలో అలుముకున్న కరుపు ప్రభావిత పరిస్థితులపై విచారణ సందర్భంగా జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం పదే పదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై అసంతృత్తి వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా పార్లమెంటు అమెదించిన చట్టాన్నే.. అదే తిరస్కరించినట్లు వుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కాగా జస్టిన్ ఎన్వీ రమణ ప్రభుత్వ కరువు విషయంలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు, దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవా అంటూ మండిపడ్డారు. ఈ అంశంలో పిటీషనర్ కోరినట్లు  కోర్టు కమీషనర్లను ఏర్పాటు చేయడం తప్ప తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని పేర్కోన్నారు.

కేసు విచారణ సంరద్భంగా.. గత వేసవిలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా ఉండేలా చూసుకోవాలని, వచ్చే వేసవి సమయానికి కరవును తట్టుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, మైండ్ సెట్ మార్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మెట్టికాయలు వేసింది. గతంలో మాదిరిగా కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశముంది కనుక ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ స్వరాజ్ అభియాన్ అనే ఎన్జీవో సంస్థ తరపున ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు కేంద్రానికి హెచ్చరికలు చేసింది.

దేశంలో కరవు పరిస్థితులను తట్టుకునేందుకు ముందునుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. గత వేసవిలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా సహా దేశంలోని పలు ప్రాంతాలు తీవ్ర కరవుతో అల్లాడిపోయిన సంగతిని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. గతంలో సరైన సమయంలో కరవు ప్రాంతాలుగా ప్రకటించలేదని, అదే తప్పు మళ్లీ చేయవద్దని చెప్పింది. ‘ఇల్లు కాలుతున్నప్పుడే బావి తవ్వే ప్రయత్నం చేయకండి’ అంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  drought  states  union government  contempt of court  

Other Articles