కేజ్రీవాల్ పై బండ బూతులతో కామెంట్లు | BJP MLA Rameshwar Sharma comments on Kejriwal, Nirupam for Anti-Army comments

Bjp mla rameshwar sharma comments on kejriwal nirupam for anti army comments

BJP MLA Rameshwar Sharma comments on Kejriwal, Parents First night video, Kejriwal Nirupam for Anti-Army comments,

BJP MLA Rameshwar Sharma comments on Kejriwal, Nirupam for Anti-Army comments.

కేజ్రీవాల్ పై దారుణమైన కామెంట్లు

Posted: 10/05/2016 04:15 PM IST
Bjp mla rameshwar sharma comments on kejriwal nirupam for anti army comments

సర్జికల్ దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సైన్యం దమ్మును శంకించే విధంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ నిరుపమ్, సీనియర్ నేత చిదంబరంలకు దిమ్మ తిరిగిపోయేలా పంచ్ ఇచ్చాడు ఓ బీజేపీ నేత. మధ్యప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే రామేశ్వర శర్మ వారిని ఉద్దేశిస్తూ కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశాడు.

ఆర్మీ జవాన్ల సత్తా గురించి మాట్లాడే వ్యక్తులు తమ తల్లిదండ్రుల ఫస్ట్ నైట్ వీడియోను చూశాకే వారి పుట్టుకను నిర్ధారించుకుంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓవైపు దేశం కోసం తమ రక్తాన్ని ధారపోస్తూ సైనికులు పోరాడుతుంటే... వారి సాహసకృత్యాలను అనుమానిస్తూ కొందరు నేతలు రాజకీయాలను చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. వారంతా పాకిస్థాన్ ఏజెంట్ ల్లాగా ప్రవర్తిస్తున్నారు, నవాజ్ షరీఫ్ చంచాల్లాగా ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డాడు.

ఇక మరో ఎంపీ అలోక్ సంజర్ అయితే మరో మెట్టు ఎక్కి వారిపై విరుచుకుపడ్డాడు. దాడుల వీడియోలు అడుగుతున్నవారు ముందు తమ తండ్రులు ఎవరో తల్లులను ప్రశ్నించాలంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా, వారు చేసిన వ్యాఖ్యలపై దాదాపు అంతటా విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా వారంతా పాకిస్థాన్ ప్రతినిధుల్లా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాం వ్యక్తం చేశాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA  Rameshwar Sharma comments  Kejriwal  Chidambaram  

Other Articles