జాతిపిత, మాజీ ప్రధానులను భారతజాతి నివాళులు.. PM Modi pays tribute to Mahatma Gandhi, Lal Bahadur Shastri

Pm modi pays tribute to mahatma gandhi lal bahadur shastri on their birth anniversary

october 2nd, Gandhi jayanthi, lal bahadur shastri jayanthi, pranab mukharjee, narendra modi, hamid ansari, sonia gandhi, shastri jayanti, mahatma gandhi, lal bahadur shastri, tribute to gandhi, rajghat, vijay ghat, tributes paid to gandhi, tributes paid to shastri

Several leaders including President Pranab, PM Modi, former PM Manmohan Singh, Delhi CM Arvind Kejriwal, VP Hamid Ansari among others reached Rajghat and paid tribute to Mahatma Gandhi on his 147th birth anniversary.

జాతిపిత, మాజీ ప్రధానులను భారతజాతి నివాళులు..

Posted: 10/02/2016 09:41 AM IST
Pm modi pays tribute to mahatma gandhi lal bahadur shastri on their birth anniversary

శాంతి, అహింసలనే అయుధాలుగా మలుచుకుని.. ఒకవైపు దేశానికి స్వతంత్ర్య ఉద్యమాన్ని నడుపుతూనే.. మరోవైపు కడు పేదరికంలో బతుకుబండీ లాగుతున్న భారత పేదలను చూసి చోక్కా లేకుండా ఉద్యమంలో పాల్గోంటూ తన భిన్నత్వాన్ని ప్రదర్శించిన జాతిపిత మహాత్మా గాంధీ 147వ జయంతి ఇవాళ. జాతీపిత పేరు చెప్పగానే మనకు భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమం కళ్లముందు కనబడుతుంది. ఉప్పు సత్యాగ్రహం, నుంచి క్విట్ ఇండియా మూవ్ మెంట్ వరకు అన్ని దృష్యరూపం అవిష్కృతమౌవుతుంది.

అలాంటి మహనీయుడు చూపిన బాటలో మనందరం నడవాల్సిన బాధ్యత మనపై వుంది. సత్యం వధ, ధర్మం చర అని బలంగా నమ్మిన భారతీయులలో అగ్రగన్యుడిగా నిలచిన పూజ్య బాపూజీ ఆశయ సాధనకు మనందరం నడుస్తామని ఆయన జయంతి సందర్భంగా స్వతంత్య వాయువును పీల్చుతున్న ప్రతీ భారతీయునడు ప్రతీణ బూనాల్సిన అవశ్యకత వుంది. ఇక పూజ్య బాపూజీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులర్పించారు.

అలాగే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రులు బాపూజీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు.
 
ఇంకా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలు ఖాధీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు నిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ మాట్లాడుతూ.. పేదలు అత్యధికంగా ఉన్న ఖాదీ రంగంలో ఉన్నారని వారిని ప్రోత్సహించేందుకు స్వదీశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ 1892 లో ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించారని మోడీ గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles