ఆ ఐదుగురు అవినీతి మంత్రులు అవుట్? | Chandrababu Naidu oust those 5 Cabinet ministers

Chandrababu naidu oust those 5 cabinet ministers

Five Ministers oust from AP Cabinet, Andhara Pradesh Cabinet Re shuffle, After Municipal elections AP cabinet reshuffle, January 2017 Cabinet, AP cabinet reshuffle January 2017, Babu eyed on 5 ministers, Chandrababu concentrate 5 ministers, 5 ministers ousted from AP cabinet

AP CM Chandrababu Naidu oust those 5 ministers from Cabinet.

ఏపీ మంత్రుల ఫ్లస్, మైనస్ లతో టెన్షన్

Posted: 09/30/2016 11:02 AM IST
Chandrababu naidu oust those 5 cabinet ministers

సాధారణ ఎన్నికలు, మునిసిపల్, పంచాయతీ ఎన్నికల తర్వాత రెండేళ్లుగా ఇప్పటి వరకు ప్రజల నాడిని చాటిచెప్పే ఎన్నికలు జరగలేదు. అందుకే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలని టీడీపీ, పైచేయి సాధించాలని వైసీపీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తం ఆరు కార్పొరేషన్లు, ఐదు పురుపాలక సంఘాలకు ఎన్నికల జరగనున్నాయి. ఇందుకోసం ఏపీ మంత్రులు, ముఖ్యంగా ఓ ఐదుగురు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ప్రారంభించేశారు.

ఇటీవల మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే. విజయదశమికి విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. అయితే మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో విస్తరణను కాస్త జనవరికి పోస్ట్ పోన్ చేశారు. ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి మంత్రులుగా ప్రమోషన్లు ఇవ్వటంతోపాటు, వెనకబడిన వారికి ఉద్వాసన తప్పదంటూ సీఎం చంద్రబాబు బాహాటంగానే పేర్కొన్నారు. దీంతో ఉద్వాసన తప్పదన భావనలో ఉన్న కొందరు మంత్రులు హుటాహుటిన కదిలి సంక్షేమ కార్యక్రమాలపై పడిపోయారు. ముఖ్యంగా ఏం చేసినా తమపై వేటు తప్పదని భావిస్తున్న ఓ ఐదుగురు మంత్రుల్లో మాత్రం గుబులు మొదలైందని తెలుస్తోంది.

తరచూ వివాదాల్లో ఉంటున్న ఓ మంత్రి సహా గతంలో ఆరోపణలు వెల్లువెత్తిన ఓ మహిళా మంత్రికి కూడా ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. వీరితోపాటు మరో ముగ్గురి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఊస్టింగ్ లిస్ట్ లో తమ పేర్లు తెలుసుకున్న ఆ ఐదుగురు ఇప్పటి నుంచే కాగల పనులను చక్కబెట్టుకుంటున్నారంట. మరోవైపు ఆ ఐదుగురు ఎవరన్న దానిపై నేతల మధ్య ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో ఆయన సహా 20 మంది ఉన్నారు. మరో ఐదుగురికి అవకాశం ఉంది. ఇప్పుడు అనుకుంటున్నట్టు ఐదుగురిని తప్పిస్తే మొత్తం పదిమంది కొత్తవారికి అవకాశం లభిస్తుంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఏంటంటూ ఇప్పటికే తెలంగాణలో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఎదురయ్యే అవకాశం ఉందని టీడీపీ సీనియర్ నేతలే చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరికి అవకాశం ఇస్తారో తెలియని టీడీపీ శ్రేణులు ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, కూడికలు తీసివతల్లో చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Cabinet  Reshuffle  January  5 ministers  Ousted  

Other Articles