పుట్ బోర్డు జర్నీ చేసిన స్టూడెంట్స్ ని కొరికిన లేడీ కండక్టర్ | Woman conductor bites two students in Bangalore

Woman conductor bites two students in bangalore

Woman conductor bites two students, Bangalore Woman conductor bites Student, Woman Conductor quarrel with Students, Student Quarrel with Conductor, Students Bus Conductor, Conductor bite passengers

Woman conductor bites two students in Bangalore because of Foot Board Journey.

ITEMVIDEOS:ఫుట్ బోర్డు జర్నీ చేయొద్దన్న లేడీ కండక్టర్ తో...

Posted: 09/30/2016 12:16 PM IST
Woman conductor bites two students in bangalore

ఓ విద్యార్థులు ఫుట్ బోర్డు జర్నీ చేయటం, వారిని లేడీ కండక్టర్ వారించడం అది కాస్త చిలికి చిలికి పెంటగా మారింది. బెంగళూరు లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా, నెట్ లో అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

యోలహంక నుంచి పీన్యా రూట్లో 401 నంబర్ బస్సు. ఓ ముగ్గురు విద్యార్థులు ఫుట్ బోర్డు జర్నీ చేస్తున్నారు. కండక్టర్ అరుణ వారిని లోపలికి రమ్మని వారించింది. అయినా వారు వినకుండా వేలాడుతూనే ఉన్నారు. ఇంతలో వారి పాస్ లను లాక్కున్న కండక్టర్ డిపోకి వచ్చి తీసుకోవాలని వారికి సూచించింది. బస్ కామాగొండానాహల్లి బస్ట్ స్టాప్ కి చేరుకోగానే ఆ ముగ్గురు విద్యార్థులు అరుణతో వాగ్వాదానికి దిగారు.

ఓ దశలో ఆమెపై చేయి వేసి దురుసుగా ప్రవర్తించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె వారిపై పడి కొరకసాగింది. చుట్టుపక్కల వారంతా అక్కడి చేరి చోద్యం చూశారే తప్పించి ఎవరు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. చాలా మంది అయితే తమ మొబైల్ ఫోన్లలో అదంతా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని ఆపి గంగామ్మాన్ గుడి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు.

పబ్లిక్ సర్వెంట్ విధులకు ఆటంకాలు కల్పించారని ఆ ముగ్గురిపై కండక్టర్ కేసు నమోదు చేయగా, తమను గాయపరచడమే కాకుండా,బూతులు తిట్టిందంటూ ఆ ముగ్గురు అరుణపై రివర్స్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Woman Conductor  Bites  Students  

Other Articles