అది బీజేపి-అరెస్సెస్ ల పనే.. రాహుల్ గాందీ Rahul blames BJP, RSS for shoe attack, says he's not afraid

Shoe hurled at rahul during up roadshow

congress, BJP, vice president rahul gandhi, PM modi, congress, BJP, rahul gandhi, Prime Minister Narendra Modi, selfie and promise-making machine, achhe din, 'Deoria to Dilli kisan yatra', RSS, PM Modi,Rahul Gandhi,Rahul Gandhi Kisan Yatra

A shoe was hurled at Congress vice-president Rahul Gandhi in Sitapur, Uttar Pradesh during his party’s roadshow. Rahul Gandhi is in Uttar Pradesh campaigning for Congress party for the upcoming elections in the state.

అది బీజేపి-అరెస్సెస్ ల పనే.. రాహుల్ గాందీ

Posted: 09/26/2016 06:18 PM IST
Shoe hurled at rahul during up roadshow

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో దియోరా టు ఢిల్లీ కిసాన్ యాత్రతో దూసుకుపోతున్న కాంగ్రెస్ యువనేత, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పరాభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్ సీతాపూర్లో రోడ్ షో నిర్వహిస్తున్న రాహుల్ పై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. అది కాస్తా రాహుల్ గాంధీ తల పక్కనుంచి వెళ్లింది. రాహుల్ పై షూ విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఎవరు..? చెప్పు ఎందుక విసిరాడు అన్న అంశాలను విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ.. తాను ఇలాంటి చౌకబారు ఘటనలకు భయపడనని అన్నారు.

ప్రజలకు ఎన్నో హామీలను గుప్పించిన ప్రధాని నరేంద్రమోడీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రజల సాక్షిగా తాను విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు.. దాని అనుబంధ సంస్థ అర్ఎస్సెస్ కార్యకర్తలు ప్రోత్భలంతోనే తనపై చెప్పులు విసిరేశారని రాహుల్ గాంధీ అరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన వారే తనపై షూ విసిరారని ఆయన ఆరోపించారు. తాను ఇటువంటి సంఘటనలకు భయపడబోనని, ఇంకా ఎన్ని చెప్పులు విసురుతారో విసురుకోవాలని అన్నారు. ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడే వారి  అసలు రంగును ఓటర్లు కనిపెడతారని, అయినా వీటికి తాను బయపడపోనని రాహుల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  BJP  rahul gandhi  PM modi  narendra modi  RSS  

Other Articles