షరీఫ్ కు గట్టి కౌంటరే ఇవ్వనున్న చిన్నమ్మ | All eyes on Sushma Swaraj's UNGA speech

All eyes on sushma swaraj s unga speech

All Eyes on Sushma Swaraj Speech, External Minister, Sushma Swaraj To Spearhead India's Counter At UN After Nawaz Sharif's Kashmir Offensive, Sushma Swaraj counter to Pak, After Nawaz Sharif now Sushma Swaraj, Sushma Swaraj strong warning to Pak, Sushma Swaraj speech at UGCA, Sushma Swaraj speech at UN

Sushma Swaraj may give strong counter to Pakistan at UNGA speech.

చిన్నమ్మ స్పీచ్ కోసం సర్వత్రా ఆసక్తి

Posted: 09/26/2016 05:13 PM IST
All eyes on sushma swaraj s unga speech

పాక్ కుటిల నీతిని ప్రపంచ దేశాలకు తెలియజేసి అప్రమత్తం చేయటమే కాదు, అవసరమైతే మద్ధతు కూడగట్టే దిశగా భారత్ పావులు కదుపుతోంది. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరికాసేపట్లో ప్రసంగించనున్నారు. గత వారంలో పాక్ ప్రధాని ఇదే వేదికపై మాట్లాడుతూ, కాశ్మీర్ లో అల్లకల్లోలానికి భారత్ కారణమని ఆరోపిస్తూ, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎన్ కౌంటర్ లో మరణించిన బుర్హాన్ వానీని పొగడుతూ, ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వాదనను ఖండిస్తూ, పాక్ చేస్తున్న కుట్రలను అంతర్జాతీయ దేశాల దృష్టికి తీసుకెళ్లి, పాక్ వైఖరిని ఎండగట్టేందుకు సుష్మా ప్రయత్నించనున్నారు.

భారత కాలమాన ప్రకారం రాత్రి 7:20 గంటలకు ఆమె ప్రసంగం మొదలు కానుంది. ద్వైపాక్షికంగా పాక్ ను ఒంటరి చేయాలన్న ఆలోచనతో ఆమె ప్రసంగించాల్సిన అంశాలపై ఇప్పటికే మోదీతో, రక్షణ, హోం శాఖల మంత్రితో ఆమె చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే సుష్మా ప్రసంగంలో, పాక్ ఎలా ఉగ్రవాదులకు సహకరిస్తున్నది, యుద్ధ నేరాలకు ఎలా పాల్పడుతున్నది, ఉగ్రవాదులను ఎలా భారత్ కు పంపి అరాచకాలు చేస్తున్నదన్న అంశాల ప్రస్తావన ఉండనుంది.

మరోవైపు ఎవరూ ఊహించని విధంగా కోజికోడ్ లో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో మాట్లాడిన మోడీ.. పాక్ తో వార్ చేసే ఉద్దేశం తనకు లేదన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు. యుద్ధం మీద భారత్ తొందరపడకూడదన్న భావనలో ఉన్నట్లుగా సంకేతాలు వ్యక్తమైనట్లుగా అంచనా వేస్తున్నారు. ఒకవైపు భారత ప్రధాని ఆచితూచి అడుగులు వేస్తున్న వేళ.. మరోవైపు దాయాది పాక్ మాత్రం దూకుడుగా వ్యవహరించటం గమనార్హం. పాక్ తో యుద్ధం చేసే సాహసం భారత్ చేయలేదని.. అలా చేసిన పక్షంలో భారత్ కే ఎక్కువ నష్టమన్న వ్యాఖ్యలు చేస్తూ.. మైండ్ గేమ్ మొదలు పెట్టింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కాని వస్తే భారత్ కే భారీ నష్టం వాటిల్లుతుందని..అందుకే భారత్ యుద్ధం చేసే రిస్క్ చేయదంటూ పాక్ దౌత్యవేత్తలు తాజాగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

యుద్ధం కారణంగా భారత్ ఆర్థికంగా ఎంతో నష్టపోతుందని.. ఆ భారం దశాబ్దాల తరబడి ప్రజల్ని పట్టి పీడిస్తుందని.. ఆ విషయం పాలకులకు తెలుసని అందుకే యుద్ధానికి తొందరపడరన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని భారత్ భావిస్తున్నా.. ఆ ప్రయత్నం బెడిసి కొట్టి భారతే ఏకాకి అవుతుందంటూ కామెంట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో మోదీ మాదిరి యుద్ధం గురించి మెతక మాటలే మాట్లాడుతుందా? లేక స్వరం పెంచి పాక్ కి గట్టి వార్నింగే ఇస్తుందా అన్న ఆత్రుత అందరిలో నెలకొంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  External Affairs Minister  Sushma Swaraj  speech  UGCA  

Other Articles