గర్భవతి అని కూడా చూడకుండా నర్సుపై... | Akali sarpanch's husband son beat pregnant nurse

Akali sarpanch s husband son beat pregnant nurse

Shiromani Akali Dal (SAD) sarpanch, Akali Dal sarpanch's husband beat nurse, Akali Dal leader attack on Pregnant woman, Paramjit Singh and Son beat pregnant nurse

Akali sarpanch Daljit Kaur's husband Paramjit Singh and Son beat pregnant nurse in Goyal Hospital.

ITEMVIDEOS:గర్భవతి అని కూడా చూడకుండా...

Posted: 09/23/2016 02:51 PM IST
Akali sarpanch s husband son beat pregnant nurse

పంజాబ్‌లో అధికార అకాళీదళ్ పార్టీకి చెందిన ఓ నేత చేసిన పనికి చివాట్లు పడటమే కాదు, ఏకంగా అతనిపై పోలీస్ కేసు నమోదయ్యింది. మోగా ప్రాంతంలో ఓ స‌ర్పంచ్ భర్త, ఆమె కుమారుడు ఓ గర్భవతిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సంచనలంగా మారింది.

అలమ్ వాలా సర్పంచ్ దల్జిత్ కౌర్ భర్త పరమ్ జిత్ సింగ్, అతని కుమారుడు ఈ దాడిలో పాల్గొన్నారు. గోయల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న త‌మ బంధువుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ చేయించుకునే క్ర‌మంలో బిల్లు కట్టించుకోవాలని అక్క‌డి సిబ్బందిని వారు తొంద‌ర‌ పెట్టాడు. అయితే కాస్త వేచి ఉండాల‌ని రమణ్ దీప్ అనే న‌ర్సు సూచించింది.

దీంతో ఆగ్రహాం తెచ్చుకున్న ఆ ఇద్దరు ఐదు నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆ నర్సును నెట్టి వేసి కింద‌ప‌డేశారు. ఆ తరువాత ఆమెపై త‌న అనుచ‌రుల‌తో దాడి చేశాడు. అక్క‌డి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు చిక్కాయి. బాధితురాలు ప్ర‌స్తుతం అదే ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.

ఆమె చేసిన‌ ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. సెక్షన్ 451, 323, 34 ప్రకారం అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. కాగా, అకాళీదళ్ పార్టీలో ఉన్న నేతలకు ఇలా దురుసుగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. గతంలో ఓ మహిళా టీచర్ పై ఓ సర్పంచ్ ఇదే తరహాలో దాడి చేశాడు కూడా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siromani Akali Dal  Sarpanch  Husband  Son  beat  Pregnant Nurse  

Other Articles