సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కి సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. పెరోల్ మీద బయట ఉన్న రాయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పెరోల్ బెయిల్ మీద బయట ఉన్న సుబ్రతా రాయ్ గడువు ముగియటంతో దానిని పొడిగించాలని రాయ్ తరపు న్యాయవాది కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. రాయ్ మీరు వెంటనే జైలుకి వచ్చేయండి అంటూ వ్యాఖ్యానించింది.
సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ అనే రెండు సంస్థలలో పెట్టుబడి పెట్టిన వాళ్లను సెబీ నిబంధనలను ఉల్లంఘించి మోసం చేశారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. 2014 మార్చి 4 లో ఆయన తీహార్ జైలుకి వెళ్లారు. కాగా, బెయిల్ ఇవ్వాలంటే రూ. 10 వేల కోట్లు కట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో అప్పట్లో విదేశాల్లోని ఆస్తులను అమ్మేసి పెరోల్ తెచ్చుకున్నారు.
సుమారు రెండేళ్లపాటు తీహార్ జైళ్లో ఉన్న ఆయన ఆపై పెరోల్ తో బయటే ఉన్నారు. కాగా, ఎప్పటికప్పుడు బెయిల్ పొడిగించుకుంటూ వస్తూ, చివరికి జూలైలోనే ముగిసింది. దీంతో మరోసారి పొడిగించాలని రాయ్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల చిట్టను చూసి సుప్రీం కోర్టు దిగ్భ్రాంతికి గురైంది. ఇంత ఆస్తి ఉన్న సుబ్రతా రాయ్ రెండేళ్ల పాటు తీహార్ జైల్లో ఎందుకు మగ్గాడని, తక్షణమే ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించాల్సిందేనని ఆదేశించింది. అతను చెల్లించాల్సిన మొత్తం, ఆయనకున్న ఆస్తితో పోలిస్తే అత్యంత స్వల్పమని సుప్రీం కోర్టు గుర్తించింది. అయినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో పెరోల్‌ను ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ సుబ్రతా రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన విజ్నప్తిని కోర్టు తోసిపుచ్చింది.
కాగా, ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 20,000 కోట్ల నిధుల చెల్లింపు వివాదంలో అరెస్టయిన సుబ్రతా రాయ్ తీహార్ జైలుకి వెళ్లోచ్చారు. రాయ్ తోపాటు, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు శిక్ష అనుభవించిన వారిలో ఉన్నారు. తాజా ఆదేశాలతో రాయ్ అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more