గ్రామస్థులు అంతా చూస్తుండగానే 22 ఏళ్ల టీచర్ కరుణను నడిరోడ్డుపై 22 సార్లు కత్తితో పొడిచి చంపాడు సురేందర్ సింగ్. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ప్రేమోన్మాది ఘాతుకంపై పోలీసులు త్వరగతినే స్పందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణంలో సురేందర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తానేం ఆమె వెంట పడలేదని, 2012 నుంచి తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని తెలిపాడు. అంతే కాదు వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను కూడా పోలీసులకు చూపించాడు.
2012 నుంచి నాలుగేళ్ల పాటు తమ మధ్య బంధం బాగానే సాగిందని, ఏడాదిగా ఒడిదుడుకులకు గురవుతూ సర్దుకుందని తెలిపాడు. ఈ మధ్య కాలంలో ఆమె ప్రవర్తనలో తేడా కనిపించడంతో ఆమె ఫేస్ బుక్ పేజ్ ఓపెన్ చేశానని, అందులో మోహిత్ అనే వ్యక్తితో ఆమె అనుబంధం పెచుకుంటున్న విషయం నిర్ధారణ అయిందని, ఆమె మోహిత్ కు అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలు పంపిందని, అసభ్యంగా ఛాటింగ్ కూడా చేసిందని చెప్పాడు. దీంతో వాటిపై మాట్లాడేందుకు ఆమెకు ఫోన్ చేసి తాము ఎప్పుడూ కలుసుకునే జీటీబీ మెట్రోస్టేషన్ వద్దకు రమ్మని పిలిచానని తెలిపాడు.(ఇది కూడా చదవండి నడిరోడ్డుపై యువతిపై దారుణం)
అయితే, ఇంకో వ్యక్తి పట్ల వ్యామోహం పనికిరాదని చెప్పే ప్రయత్నం చేయడంతో ఆమె ఎదురు తిరిగిందని, దీంతో ఫేస్ బుక్ లో ఆమె ఫోటోలు, ఛాటింగ్ సంగతి ఎత్తి చూపానని, తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడాల్సిన కరుణ తనను గూఢచర్యం చేస్తున్నావా? అని నిలదీసిందని, ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయడాన్ని తప్పు పట్టి, తనను తిట్టిపోసిందని తెలిపాడు. దీంతో ఆగ్రహానికి గురైన తాను ఇంకోసారి ఇలాంటి పని చేస్తే పొడిచేస్తానని ఆమె బ్యాగుపై కత్తిని వుంచి ఆడించానని చెప్పాడు.
దీంతో 'నీకు కత్తి ఎలా వాడాలో కూడా తెలియదు' అంటూ కరుణ తనను ఎద్దేవా చేసిందని సురేందర్ తెలిపాడు. తనకు కత్తి ఎంత బాగా వాడటం వచ్చో చూపించాలనే ఉద్దేశంతోనే ఆమెను అన్నిసార్లు కత్తితో పొడిచానని పోలీసులకు విచారణలో తెలిపాడు. ఆమెను హత్య చేసిన తరువాత పోలీసులకు ఫోన్ చేసింది కూడా తానేనని వారికి తెలిపాడు. దీంతో పోలీసులు వారి మొబైల్ ఫోన్ లొకేషన్లను ట్రేస్ చేయగా, హత్యకు గంట ముందు నుంచి వారిద్దరూ అతను చెప్పిన ప్రదేశంలోనే ఉన్నట్లు తేలింది. అలాగే, కరుణ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన పోలీసులు సురేందర్ సింగ్ చెప్పినట్టు వారిద్దరి ఫోటోలను కూడా గుర్తించారు. ఇదిలా ఉండగా, కరుణ తల్లి మాత్రం అల్రెడీ పెళ్లయిన 34 ఏళ్ల సురేందర్ వెంటాడి వేధించే వాడని చెబుతుండటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more