ఐరాసలో ఇండియాపై వంకర వ్యాఖ్యలు | Nawaz Sharif rakes up Kashmir at UNBurhan Wani symbol of Kashmiri intifada

Nawaz sharif rakes up kashmir at unburhan wani symbol of kashmiri intifada

Nawaz Sharif rakes up Kashmir, Nawaz Sharif speech at UN, Nawaz praises Burhan Wani, Nawaz raise Kashmir issue in UN, Burhan Wani symbol of Kashmiri intifada.

Nawaz Sharif rakes up Kashmir at UNBurhan Wani symbol of Kashmiri intifada.

ఐరాసలో భారత్ పై షరీఫ్ వంకర వ్యాఖ్యలు

Posted: 09/22/2016 09:10 AM IST
Nawaz sharif rakes up kashmir at unburhan wani symbol of kashmiri intifada

పాక్ వక్రబుద్ధి మారలేదు. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. గతంలో తమ దేశంలో మాత్రమే భారత్ ను విమర్శించే నవాజ్ షరీఫ్ ఈసారి బరితెగించి తొలిసారి బయట, అది కూడా ఏకంగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఉగ్రవాది బుర్హాన్ ని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలపై భారత్ మండిపడుతోంది.

భారత అంతర్గత విషయమైన కశ్మీర్ అంశంపై సభలో ప్రసంగిస్తూ... ఆ అంశాన్ని భారత్ తేల్చి ఉంటే తమ ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియ మరింత ముందుకెళ్లి ఉండేదని అన్నారు. ఎన్ కౌంటర్ లో మరణించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీని అమరవీరుడిగా ఆయన కీర్తించారు. కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న యువతను భారత ఆర్మీ బలిగొంటోందని, ఆర్మీ పెల్లెట్ గన్ ల ధాటికి ఎంతో మంది పిల్లలు చూపుకోల్పోయారని ఆయన ఆరోపించారు. కాశ్మీర్ లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయసేకరణ ద్వారా కశ్మీరీల మనోగతం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

అసలు కశ్మీర్ విషయంలో భారత్ ఎప్పటికప్పుడు మాటతప్పుతోందని అర్థం పర్థం లేని ఆరోపణలు చేశాడు. కశ్మీర్ లోయలో భారత ఆర్మీ అకృత్యాలపై ఆధారాలను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ కు అందజేస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా అమెరికా, బ్రిటన్, జపాన్, టర్కీ దేశాధినేతలతో సమావేశమై కశ్మీర్ అంశంపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles