అపెక్స్ భేటీలో ఏం జరిగింది? | Uma Bharathi explained details of Telugu CMs Apex Committee meeting

Uma bharathi explained details of telugu cms apex committee meeting

Apex committee meeting, Water Apext meeting, Uma Bharathi KCR Chandrababu, Telugu CMs on Godavari ana Krishna Waters, Uma Bharathi press meet,

Uma Bharathi explained details of Telugu CMs Apex Committee meeting.

ITEMVIDEOS:అపెక్స్ భేటీ సక్సెస్ అయ్యిందా?

Posted: 09/21/2016 06:03 PM IST
Uma bharathi explained details of telugu cms apex committee meeting

కృష్ణా జ‌లాల వివాదంపై కేంద్ర మంత్రి ఉమాభార‌తి స‌మ‌క్షంలో బుధవారం డిల్లీలో తెలుగు సీఎంల ఏర్పాటు చేసిన అపెక్స్ క‌మిటీ తొలి స‌మావేశం ముగిసింది. మీటింగ్ ముగిసిన వెంటనే అందులో చర్చించిన విషయాలను, పురోగతి తదితర విషయాలను మంత్రి ఉమాభార‌తి మీడియాకు వివరించారు. ముఖ్యంగా కృష్ణా జ‌లాల వివాదం అంశంపై ప్రధానంగా చ‌ర్చించామ‌ని, స‌మావేశం సామ‌ర‌స్యంగా జ‌రిగింద‌ని ఆమె తెలిపారు.

గోదావరి పై నిర్మిస్తున్న ప్రాజెక్టులతోపాటు కృష్ణా జ‌లాల విష‌యంలో క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల నుంచి వ‌స్తోన్న అభ్యంత‌రాలపై కూడా చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. మూడు అంశాల‌పై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పిన ఆమె మరో రెండు విషయాల్లో మాత్రం వ్యతిరేకత ఎదురైందని తెలియజేశారు. నదీ జలాల పంపిణీలో వివాదాల పరిష్కారానికి మార్గం ఆలోచించామని పేర్కొన్నారు.కేంద్ర, రెండు రాష్ర్టాల ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

Uma Bharathi press meet

నదీ పరీవాహక ప్రాంతాల్లో నీటి ల‌భ్య‌త ఆధారంగా అంచ‌నా వేసి ఇరు రాష్ట్రాల‌కు దామాషా ప్ర‌కారం నీటి పంపిణీ జ‌రుగుతుంద‌ని ఉమాభార‌తి తెలిపారు. అన్ని ప్రాజెక్టుల అంశాల్లో టెలిమెట్రీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అంగీక‌రించారని అన్నారు. నీటి పంపిణీపై కేంద్రం, రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారుల‌తో నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. కమిటీ అధ్యయనం చేసిన నివేదికను ట్రైబ్యునల్ కు అందజేస్తుందని చెప్పారు. నీటి లభ్యత ఆధారంగా ట్రైబ్యునల్ సూచనల మేరకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

 

భేటీ లో చర్చ:

పాల‌మూరు రంగారెడ్డి, డిండీ ప్రాజెక్టుల‌పై ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. ఆ ప్రాజెక్టులు పాత‌వేన‌ని తెలంగాణ తెల‌ప‌గా, అవి కొత్త‌వ‌ని ఏపీ తెలిపిన‌ట్లు స‌మాచారం. కొత్త ప్రాజెక్టుల‌పై ఏపీ వినిపిస్తోన్న వాదన‌పై తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌తనివ్వాల‌ని ఉమాభార‌తి సూచించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు రాజ‌కీయ అనుభ‌వం ఉన్నవారని, రాజ‌నీతిని ప్ర‌ద‌ర్శించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ఈ సందర్భంగా ఉమాభార‌తి సూచించారు. మ‌రోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం అంటూ ఏమీ ఉండ‌బోద‌ని తేల్చిచెప్పారు.

Uma Bharathi flowers

Uma Bharathi KCR chandra Babu

సమావేశం ప్రారంభానికి ముందు ఇరు రాష్ట్రాల సీఎంలు ఉమా భారతికి పుష్పగుచ్చం అందజేయగా, అందులోంచి పువ్వులను తీసి కేసీఆర్, చంద్రబాబు చేతిలో చెరోకటి పెట్టింది ఆమె. దీంతో అక్కడున్న వారందరి మొహంలో నవ్వులు పూశాయి. ఉమాభారతి మీడియా సమావేశం తర్వాత ఏపీ సీఎం చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంపై కేంద్రమంత్రితో మ‌రోసారి ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister  Uma Bharathi  Apex Meeting  Telugu States  

Other Articles