ప్రధాన సేవకుడికి పుట్టిన రోజు విషెస్ | PM Narendra Modi's 66th birthday Celebrations and wishes

Pm narendra modi s 66th birthday celebrations and wishes

PM Narendra Modi's 66th birthday, Narendra Modi's 66th birthday, PM Narendra Modi's Birhday special, Modi 66th birthday, Modi birthday 2016, Modi 2016 Birthday, Modi wishesh from mother, Modi Advaniji Birthday wishes, Advani wishes PM Modi Birthday

PM Narendra Modi's 66th birthday Celebrations and wishes.

హ్యాపీ బర్త్ డే టూ నరేంద్ర దామోదర దాస్ మోదీ

Posted: 09/17/2016 10:45 AM IST
Pm narendra modi s 66th birthday celebrations and wishes

ఒక ప్రభుత్వ పాలనపై కొంత నిర్దిష్ట కాలం తర్వాత అసంతృప్తి పెరిగిపోవటం సాధారణమైన వ్యవహారమే. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, పైగా ప్రతీ దాన్ని రాద్ధాంతం చేసి పబ్బం గడుపుకోవాలనే విపక్షాలు ఉన్నంతకాలం అది జరిగేందుకు ఎంతో కాలం పట్టడం లేదు. కానీ, ఆ సాంప్రదాయానికి అడ్డుకట్ట వేసిన ఒకేఒక్క మంత్రం నమో. 2014 సార్వత్రిక ఎన్నికల ముందుకు మొదలైన ఈ నామస్మరణ రెండేళ్లు పూర్తయి మూడో ఏటా అడుగుపెట్టినా ఎఫెక్ట్ అలాగే ఉంది.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో ప్రజా నాడి నిరంతరం మారుతూనే ఉంటుందన్నది మేధావుల మాట...! కానీ, మోదీ ముందు అది చెల్లలేదు. జనంలో పాపులారిటీ తగ్గలేదు సరికదా విదేశాల్లో కూడా పీక్స్ లోకి పెరిగిపోయింది. అగ్ర రాజ్యమైనా, దాయాది దేశమైనా మోదీ వెళ్తున్నారంటే అంతర్జాతీయ మీడియా అక్కడ వాలిపోవటం, అక్కడుండే భారతీయులే కాదు, స్థానికులు కూడా ఫోటోల కోసం ఎగబడిపోవటం పరిపాటిగా మారిపోయింది. అసలు మోదీ అంటే ఎందుకంత పిచ్చి బేరీజు వేసుకుంటే...

ఆకర్షించే విగ్రహా రూపం, వ్యవహార శైలి, కట్టిపడే ఉపన్యాసాలు, అన్నింటికి మించి కష్టించి పనిచేసే తత్త్వం ఇన్ని లక్షణాలు ఉన్న నాయకుడు మన దేశానికి ప్రధాని కావటం అదృష్టమనే చెప్పుకోవాలి. ఎర్రకోట నుంచి అమెరికన్ పార్లమెంట్ దాకా ఎక్కడైనా ఆయన ఉంటే అక్కడ మారుమ్రోగిపోవాల్సిందే. ఆయన వాగ్ధాటికి చప్పట్లు, స్టాండింగ్ ఒవేషన్లు... ఫోటోల కోసం ఎగబడిపోయే జనాలు, షేక్ హ్యాండ్ కోసం పరితపించే అధినేతలు, అందుకు అగ్రరాజ్య అధ్యక్షుడు సైతం మినహాయింపు కాదు.

నేడు (సెప్టెంబర్ 17 శనివారం) నరేంద్ర దామోదర దాస్ మోదీ 66వ వసంతంలోకి అడుగు పెట్టారు. 66 ఏళ్లలోనూ అదే యూత్ మాదిరి స్పీడ్.. చలాకీతనం. విదేశీ పర్యటనలను కూడా దేశ హితం కోసం వాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. విదేశీ పర్యటనలపై ఖర్చుకు సంబంధించి ఆరోపణలు చేసే ప్రతిపక్షాలకు లెక్కలతో షాక్ లు ఇస్తూనే ఉంటారు. టైం వేస్ట్ కాకుడదన్న ఉద్దేశంతో రాత్రిపూట జర్నీలు చేసే తత్వం ఆయనది.

ఆయనది ఒకటే అజెండా....నేషన్ ఫస్ట్...! దేశ హితమే ఆయనకు ప్రధానం...! అంతేకాదు తాను ప్రధానిని కాదని....125 కోట్ల మంది భారతీయులకు ప్రధాన సేవకుడనని ప్రకటించుకున్న వినయశీలి. భారత్... మళ్లీ విశ్వగురు పీఠం అధిష్టించాలి. వరల్డ్ నంబర్ వన్ కావాలి. ఇండియా డెవల్ కావాలంటే మొదట రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలి. ప్రతి రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలి. ఇదే ఆయన స్వప్నం...!

బీజేపీ ప్రభుత్వాలు అయినా..., బీజేపీ యేతర ప్రభుత్వాలు అయినా మోదీకి తేడా లేదు. అందుకే భారత్ లోని రాష్ట్రాల ప్రభుత్వాలను.... కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి ఆయన టీం ఇండియా అన్నారు. ఇదే స్పిరిట్ తో ఆయన ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉదారంగా నిధులు మాత్రమే కాదు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. తన మూడేళ్ల పాలనలో పీఎం మోదీ... ఎన్నో విజయాలు చేశారు... అపజయాలు కూడా చూశారు. అయినా కూడా ఆయనపట్ల ప్రజల్లో అదే నమ్మకం... అదే ఆదరణ...! అందుకే ఆరోపణలు చేసిన నోళ్లే ఆఫ్ ది రికార్డ్ లో మోదీ ద బెస్ట్ అని చెబుతుంటారు. ఆయన కలలు నిజం అయి త్వరలో మన గమ్యం చేరుకోవాలని మనమంతా ఆశిస్తూ మనవంతు సహకారం అందిద్దాం... దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలుగు విశేష్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  66th Birthday  Celebrations  

Other Articles