అన్ని సంస్థానాల వీలీనం కంటే హైదరాబాద్ సమ్ థింగ్ స్పెషల్ | Telangana liberation day special article

Telangana liberation day special article

Raghuram Patibanda telangana liberation day special article, telangana liberation day 2016, telangana liberation day article, writer Raghuram Patibanda, telangana liberation day, Hyderabad Liberation day, telangana liberation day history, telangana liberation day, Liberation day in telangana

Telangana liberation day special article written by Raghuram Patibanda.

తెలంగాణ విమోచన దినోత్సవ ప్రత్యేకం

Posted: 09/17/2016 10:26 AM IST
Telangana liberation day special article

సొంత రాష్ట్రంలో రెండేళ్లు గడిచిపోయాక మొదటిసారి తెలంగాణ విమోచన దినోత్సవం గురించి టాపిక్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. నిజాం కబంధ హస్తాల నుండి హైదరబాదు సంస్థానం విముక్తిపొందిన రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినం గా పాటిస్తారు. దీనిని అధికారికంగా జరిపేందుకు నేతలు సిద్ధమైపోతున్నారు. మరి దీని గురించి కాస్త చరిత్ర ముందు చెప్పుకోవాలి కదా... 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు.

ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని గురేస్తానని విర్ర వీగాడు.. ఇలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్ అలీఖాన్. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కంతిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు.. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది.

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రచయిత రఘురామ్ పాటిబండ కొన్ని మాటలను, ఓ గేయం తెలుగు విశేష్ కోసం అందజేశారు. ఆయన స్వామి రామనంద తీర్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియో-ఎకనామిక్ రీసెర్చి అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కు జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలయినది పదొహేడవ తారీఖు Sep. 1948 వ సంవత్యరములోనే.

నైజామ్ ప్రభుత్వ దాశ్య శృంఖాలనుండి మనకు విముక్తి కలిగి, నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు ఇదే.

ఇతర భారతీయులందరికి ఆగశ్ట్ పదిహేను 1947 లో వచ్చినా ఈ రోజే మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చినట్లుగా భావించాలి.

దీనికి కారణమైన మన స్వాతంత్ర సమర యొధులను మనము మరువ కూడదు.

వారి నిస్వార్ద సేవను , దేశ భక్తిని ,భారతీయతను , మనము ఎన్నడు మరువ రాదు.

వారి పోరాట ఫలితమే మనము ఈ నాడు ఈ విమోచన రోజును జరుపు కుంటున్నాము.

అట్టి వారిలో స్వామి రామానంద తీర్ద, గోవింద్ భాయ్ షరాఫ్, నరసింహారావుగార్లు ప్రముఖులు.

ఈ శుభ సందర్భములో మీ అందరికి నా శుభాకాంక్షలు.

మన నూతన తెలంగాణా రాష్ట్రం వెలసిన సందర్బంలో నేను రాసిన నా తొలి పలుకులను అక్షర రూపంలో పెట్టి మీ ముందు ఎవరైనా చదువుతారనే ఆశతో పంపిస్తున్నాను.


*మన తెలంగాణ పాట*

గళమెత్తి పాడరా తెలుగోడా, తెలంగాణా ఒక రతనాల గడ్డరా అని

అలనాటి స్వాతంత్య సమర యోధుల త్యాగాల ఫలమురా మన తెలంగాణా

ఇలనాటి అమర వీరుల బలిదానాల ఫలమురా మన వీర తెలంగాణా...

గళమెత్తి పాడరా తెలుగోడా......

సాతవాహనులు, కాకతీయులు, రెడ్డిరాజులు,సుల్తానులు,కుతుబ్

షాహీలు,మొఘల్స్ పాలించిన గడ్డరా ఈ తెలంగాణా,

నేలతల్లి మెప్పు పొందినదిరా, మన పుణ్య భూమి...

గళమెత్తి పాడరా తెలుగోడా.....

తెలుగు జాతి ఒక్కటని పాలించిన మన పూర్వీకులు ,

భిన్న సంస్కృతులకు నిలువు టద్దమై నిలచింది మన తెలుగు సీమ

మన భాష, మన సంస్కృతి, మన ఆత్మ విశ్వాసాన్ని నిలబెట్టుటకై,

ఏర్పరచుకొన్న మన రాష్ట్రమేరా తెలంగాణా...

గళమెత్తి పాడరా తెలుగోడా......

పారాలి నదులు మన పంట పొలాల దిసగా,

పండాలి పంటలు పలు సమృద్దిగా

సాగాలి ముందుకు అందరిని కలుపుకొని,

పయనించాలి అన్ని రంగాలవైపు వెలుగును నింపుతూ...

గళమెత్తి పాడరా తెలుగోడా......


                                                                       -రఘురామ్ పాటిబండ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Liberation day 2016  Special Article  

Other Articles