భలే దోంగ.. ఇంటి యజమానికి జాబితా రాసిపెట్టాడు Burglars leave behind notes for homeowner

Burglars leave behind notes for homeowner

Thieves Leave Behind Letters,Texas Robbery,Texas Theft,Joseph Alvarado, International news, crime news, crime, local, houston, khou.com, southwest houston, burglars, notes, Nation-Now, News, Weird

Reliance Jio seeks TRAI's intervention over Airtel, Vodafone and Idea refusing to allow porting of their subscribers to Jio

భలే దోంగ.. ఇంటి యజమానికి జాబితా రాసిపెట్టాడు

Posted: 09/16/2016 06:33 PM IST
Burglars leave behind notes for homeowner

ఆ మధ్య కొందరు మంచి దోంగలను చూశాం. వారు పలు దుకాణల్లోకి చోరీలు చేసి.. తమకున్న అవసరం కొద్ది దొంగతనం చేశామని, లెటర్లు రాసిపెట్టిన దోంగల్ని చూశాం. అయితే ఇలాంటి తరహాలోనే మరో దొంగ భలే పని చేశాడు, అదేంటంటారా..? ఇంట్లోకి చొరబడి కనిపించిన నగదు, వస్తువులను దోచుకెళ్లే దొంగలు.. తామేం దొంగిలించిందీ రాసిపెట్టి మరీ వెళ్తే! అది వింతకాకపోతే మరేంటి? అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఈ విచిత్ర దొంగతనం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ప్లే స్టేషన్, ల్యాప్‌టాప్ సహా మరికొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారు.

తిరిగి వెళ్తూ వెళ్తూ తాము దొంగలించిన వస్తువుల వివరాలను ఓ పేపర్‌పై రాసి పెట్టి మరీ వెళ్లారు. ఇంటికొచ్చిన యజమాని జోసెఫ్ అల్వారాడో లోపల ఉన్న చిట్టీలు చూసి ఆశ్చర్యపోయారు. ‘‘నేను లోపలికి వచ్చా. నీ పీఎస్ 3, కంట్రోలర్స్, గేమ్స్, కంప్యూటర్ తీసుకెళ్లా. బై ఎ కిడ్ హ..హ్హ..హ్హ..’’ అని ఆ చిట్టీల్లో రాసి ఉంది. దానిని ఎవరో చిన్నపిల్లలే రాసి ఉంటారని, స్పెల్లింగ్‌ తప్పులు ఉన్నట్టు టీచర్ అయిన జోసెఫ్ తెలిపారు. ఈ దొంగతనాన్ని తప్పకుండా పిల్లలే చేసి ఉంటారని ఆయన చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thieves  Letters  Texas Robbery  Texas Theft  Joseph Alvarado  crime  

Other Articles