ట్రంప్ జుట్టుతో ఆడేసుకున్న యాంకర్ | Jimmy Fallon Jokes With Donald Trump Musses His Hair

Jimmy fallon jokes with donald trump musses his hair

Trump Musses His Hair, Jimmy Fallon Jokes With Donald Trump Hair, Donald Trump Hair Video, Doubts clear on Donald Trump Hair

Jimmy Fallon Jokes With Donald Trump Musses His Hair.

ITEMVIDEOS:ట్రంప్ జుట్టుతో ఆడేసుకున్న టీవీ యాంకర్

Posted: 09/16/2016 05:30 PM IST
Jimmy fallon jokes with donald trump musses his hair

వివాదాలతో అగ్రరాజ్య అధ్యక్ష బరిలో నానాటికి క్రేజ్ ను పెంచుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు ఒక తమాషా అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆ దెబ్బకి ఓ ధర్మసందేహం కూడా తీరిపోయింది. నేషనల్ టెలివిజన్ షో ‘ద టునైట్ షో’కి గురువారం ట్రంప్ హాజరయ్యారు.

‘షో’కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ ఫాలోన్ ఇంటర్వ్యూలో చివరిలో ట్రంప్ ను ఒక సరదా కోరిక కోరాడు. ‘మీరు మళ్లీ మా షోకి అమెరికా అధ్యక్షుడిగా రావచ్చు. అప్పుడు చేయలేను కనుక, ఇప్పుడే, ఆ పని చేయాలనిపిస్తోంది. ఒకసారి, మీ జుట్టును చెరిపేయొచ్చా?’ అని ఫాలోన్ అడిగాడు. అడగటమే ఆలస్యం, ఇందుకు ట్రంప్ చిరునవ్వుతో ఓకే చెప్పారు. వెంటనే, ట్రంప్ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి, ఆయన క్రాఫ్ అంతా ఫాలోన్ చిందరవందర చేసేశాడు.

దీంతో, ఈ షో చూస్తున్న ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వేశారు. ప్రేక్షకులే కాదు, ట్రంప్ కూడా నవ్వేశారు. తన పోజ్ చూసుకున్న ట్రంప్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ గా మారింది. మరోవిషయం ఏమిటంటే, ట్రంప్ జుట్టు అసలైందా? లేక విగ్గా? అనే విషయమై గతంలో పలు వదంతులు ఉండేవి. దీంతో, ఆ అనుమానం ఉన్నవారికి తీరిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donal Trumph  Hair  Jimmy Fallon  

Other Articles