తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిమజ్జనం.. తరలింపు సిద్దమైన భారీ గణనాథుడు Ganesh immersion continues in peaceful atmosphere

Ganesh immersion continues in peaceful atmosphere

ananth chturdhi, ganesh nimmajjanam, ganesh immersion, vinayaka visarjan, balapur ganesh, khairatabad ganesh, telugu states, police department, state officials, bhagyanagar ganesh ustav commitee

The 11 days long Ganesh festival celebrations has finally ended on Anant Chaturdashi (Thursday ,September 14th) when Lord Ganesh Idols will be immersed into the water.

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిమజ్జనం.. తరలింపు సిద్దమైన భారీ గణనాథుడు

Posted: 09/15/2016 08:32 AM IST
Ganesh immersion continues in peaceful atmosphere

వినాయక చవితి నుంచి అనంత చతర్థి వరకు ఏకాధశ రాత్రుల పూజలందుకున్న గణనాథుడి తన తల్లి గంగమ్మ ఒడి చేరుతున్నాడు. వాడవాడలా. వీధిదీధిలో కొలువుదీరిన బొజ్జగణపయ్యను భక్తులు ఘనంగా నిమజజనం చేస్తున్నారు. ఇవాళ తెల్లవారు జామునుంచే భక్తులు తమ వినాయకులను భారీ వాహనాలపైన నిమజ్జనానికి తరలిస్తున్నారు. వినాయక నిమజ్జనానికి తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది అఖరున నిమజ్జనం జరుపుకునే హైదరాబాద్‍ ఖైరతాబాద్ గణపతి ఈసారి గతానికి భిన్నంగా ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. ఇవాళ ఉదయాన్నే ఖైరతాబాద్ గణనాధుడ్ని నిమజజనానికి తరలించనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

బాలాపూర్ గణపయ్య లడ్డూ వేలం పాట కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ పాతబస్తీలోని బాలాపూర్ లో కొలువుదీరే వినాయకుడి చేతిలోని లడ్డూ వేలం పాట తెలుగురాష్ట్రాల్లోనే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అది ముగించగానే బాలాపూర్ గణపయ్యతో ప్రారంభమయ్యే శోభాయాత్ర వెనుకగా మిగిలిన వినాయకులు వరుసగా రావడం అనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయమే బాలాపూర్ గణేశ్ విగ్రహానికి ఇప్పటికే చివరి పూజలు పూర్తికాగా, విగ్రహం ట్రాలీ ఎక్కింది. ప్రస్తుతం బాలాపూర్ వీధుల్లో ఊరేగింపు సాగుతుండగా, మరికాసేపట్లో లడ్డూ వేలం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. గత సంవత్సరం ఈ లడ్డూను కల్లెం మదన్‌ మోహన్‌ రెడ్డి అనే వ్యక్తి రూ. 10.32 లక్షలకు దక్కించుకోగా, ఈ సంవత్సరం ఎవరు దక్కించుకుంటారు.. ఎంతకు దక్కించుకుంటారన్న విషయమై సర్వత్రా అసక్తి నెలకొంది.

విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్లో 10 క్రేన్లు, అప్పర్ ట్యాంకు బండ్పై 24 క్రేన్లను ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం నగరంలో 12వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం రూట్లో 2వేలు, సాగర్ చుట్టూ 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బంజారాహిల్స్, ఫిలింనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఆయన పూజలు నిర్వహించారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వినాయక నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. 14వ మైలు వద్ద ఉన్న ఎడమ కాల్వ వద్ద వినాయక నిమజ్జన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. నల్గొండ నుంచి 2500 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కోసం వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో నిమజ్జనానికి హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles