మళ్లీ మంచాలు మాయం | now Mirzapur sabha became funny with khats looted

Now mirzapur sabha became funny with khats looted

Mirzapur Khat Sabha, Khats looted, Rahul Khat Idea, Who ic behind Khat Idea, UP election campaign, Congress UP election, Rahul Khat Sabha, Khat pe charcha

Mirzapur Rahul meeting became funny after villagers looted Khats.

రాహుల్ కోసం మంచాలేసి ముంచుతున్నాడా?

Posted: 09/15/2016 09:08 AM IST
Now mirzapur sabha became funny with khats looted

ప్రచారం టెక్నాలజీ డిజిటల్ పుంతలు తొక్కుతున్న వేళ కీలకమైన యూపీ ఎన్నికల ప్రచారంలో ‘వెరైటీ’ గా కుర్చీల బదులు మంచాలు వేస్తే బావుంటుందని భావించిన కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. సభ ఇలా అయిపోగానే, అలా మంచాలు మాయమైపోతుండటంతో చివరకు కాట్ పే చర్చ సీన్ అంతా పిచ్చ కామెడీగా మారిపోతుంది. తొలి స‌భ‌లోనే 2 వేల మంచాల‌ను ఎత్తుకెళ్లారు స‌భ‌కు వ‌చ్చిన గ్రామ‌స్థులు. ఆ త‌ర్వాత మ‌రో స‌భ‌లో మ‌నుషుల‌ను పెట్టి మ‌రీ మంచాలు ఎవ‌రూ ఎత్తుకు వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌ని చూసి అభాసుపాలైంది

బుధవారం మీర్జాపూర్ లో నిర్వహించిన ‘ఖట్ సభ’లో రాహుల్ ప్రసంగం ఇలా ముగియగానే, మంచాల లిప్టింగ్ అలా జరిగిపోయింది. రాహుల్ ప్రసంగానికన్నా మంచాలు తీసుకు వెళ్లే ప్రజలకే మంచి పబ్లిసిటీ వస్తుండగా, దీన్నెలా ఆపాలో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్న సీన్ దర్శనమిచ్చింది. తన ప్రసంగంలో మోదీని విమర్శించేందుకే రాహుల్ అధిక సమయాన్ని తీసుకున్నారు. ఆయన ధరించి రూ. 15 లక్షల విలువైన సూట్ నుంచి మొదలు పెడితే, సెల్ఫీల పిచ్చి ఎక్కువని, ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని, విదేశాలకే పరిమితమవుతున్నారని విమర్శలు గుప్పించాడు. అయితే జనాలు మాత్రం అవేం పట్టనట్లు మంచాలనే అంటిపెట్టుకుని ఉండటం గమనించవచ్చు.

అయితే దీనిపై మీర్జాపూర్ వాసుల వాదన మరోలా ఉంది. రాహుల్ ప్రసంగం, సభ ముగిసిన తరువాత ఎవరు కూర్చున్న మంచాన్ని వారు ఎత్తుకుపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వారు హామీ ఇస్తేనే తాము వచ్చామని మీర్జాపూర్ వాసులు చెబుతున్నారు. "రాహుల్ సభకు వస్తే, ఉచిత మంచాన్ని ఇస్తామని ఓ కాంగ్రెస్ నేత మాకు చెప్పారు. ఆ పార్టీ ఇప్పటివరకూ మాకేమీ ఇవ్వలేదు. ఇప్పటికి కనీసం ఈ మంచమైనా దక్కింది" అని మీర్జాపూర్ సభకు వచ్చి ఓ మంచం పట్టుకెళ్లిన కైలాష్ నాథ్ వ్యాఖ్యానించాడు.

నిజానికి కాంగ్రెస్ కి ఈ ఐడియా ఇచ్చింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. సామాన్య ప్రజలకు చేరువయ్యే రీతిలో ఉంటుందని ఇలా రాహుల్‌ సభల్లో మంచాలు వాడాలని సూచించాడు. అయితే 2014 జాతీయ ఎన్నికల్లో ‘చాయ్‌ పే చర్చ’ పేరుతో నరేంద్ర మోదీని పాపులర్‌ చేసిన ఆయనగారు, మరి ఇప్పుడు మంచాలతో మాత్రం కాంగ్రెస్ ముంచేలా ఉన్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Rahul Gandhi  Khat Sabha  

Other Articles