పవన్ 200 కోట్ల డీల్ గాలి వార్తలు | political analysts opine pawan 200 crores offer baseless news

Political analysts opine pawan 200 crores offer baseless news

Pawan Kalyan 200 crores deal, Businessman who offer offer to Pawan, Pawan with businessman, Janasena party fund, 200 crores fund to pawan, pawan huge offer, Pawan rejects 200 crores, pawan political deal with businessman

Political Analysts opine Pawan Kalyan 200 crores political offer baseless news.

పవన్ పై అవన్నీ పనికిమాలిన పుకార్లే!

Posted: 09/14/2016 11:27 AM IST
Political analysts opine pawan 200 crores offer baseless news

రాజకీయల్లో పూర్తిస్థాయి ఆరంగ్రేటం కోసం రంగం సిద్ధం చేసుకున్న పవన్ ఓ రెండేళ్లు సినిమాలపైన కూడా దృష్టిసారించి, సరిగ్గా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్తాడనే చర్చ నడుస్తోంది. తిరుపతి, కాకినాడ సభల్లో తన ప్యూచర్ ఫ్లాన్ లు ఏంటో స్పష్టం చేయకపోయినా నేను-మనం-జనం పుస్తకంలో అవన్నీ ఉండొచ్చనే అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కి ఓ భారీ ఆఫర్ వచ్చిందనే వార్త ఈ మధ్య వార్తల్లో జోరుగా షికారు చేసింది.

ఏపీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త 200 కోట్లతో రాజకీయ డీల్ కోసం పవన్ ను సంప్రదించాడని, అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించాడని మీడియా లో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే.. అసలు అంతా ఆఫర్ ను పవన్ కి ఎవరు ఇచ్చారు?, ఆ విషయాన్ని మీడియాకు ఎవరు లీక్ చేశారు?. ఫ్యానిజం కానీ, పార్టీ ఫండ్ కోసం అంతా మొత్తం ఖర్చు చేయటం అంటే మాములు విషయంకాదు. ఒకవేళ ఏ ఎమ్మెల్యేనో, ఎంపీనో సీటు ఆశించిన అంతా పెద్ద మొత్తం ఆఫర్ చేస్తున్నాడా? అంటే వాటికి ఈ మొత్తం చాలా ఎక్కువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వదంతులపై పవన్ కూడా కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానులో లేక కాస్త పేరున్న జనసేన కార్యకర్తలే పుకార్లను లేపి మీడియాలో హైలెట్ చేశారని తెలుస్తోంది. అయితే ఇలాంటి గాలి వార్తల వల్ల పవన్ పేరుకి మచ్చ తేవటమేకాదు, పొలిటికల్ కెరీర్ పై విమర్శలు కురిపించేందుకు ప్రత్యర్థులకు కాస్త అవకాశం ఇచ్చినట్లే అవుతుందని వారంటున్నారు. ఏదేమైనా సభలు పెట్టబోనన్న ప్రకటనతో పవన్ నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుందా అని ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  200 crores  political fund  businessman  

Other Articles