స్టేటస్ గురించి కాకుండా సోనియా గురించి అందుకున్నాడు | Kavuri Sambasiva Rao slams Sonia Gandhi over AP Special Status

Kavuri sambasiva rao slams sonia gandhi over ap special status

Kavuri Sambasiva Rao slams Sonia, Kavuri Sambasiva Rao on special status, BJP leader Kavuri Sambasiva Rao on status, Kavuri Sambasiva Rao on special package, kavuri Rahul Gandhi

Kavuri Sambasiva Rao slams Sonia Gandhi over AP Special Status.

ITEMVIDEOS:తెలంగాణ వస్తే రాహుల్ పీఎం ఎలా అవుతాడబ్బా?

Posted: 09/14/2016 12:38 PM IST
Kavuri sambasiva rao slams sonia gandhi over ap special status

ప్రత్యేక హోదాపై బీజేపీ చేసిన వంచనపై పార్టీలకతీతంగా విమర్శలు పడుతుంటే ఢిఫెన్స్ కోసం ప్యాకేజీ ని హైలెట్స్ చేస్తూ అందులోని విషయాలను కూలంకషంగా వివరిస్తున్నారు కమలనాథులు. ఇప్పటికే రంగంలోకి దిగిన వెంకయ్య టీవీల్లో సైతం యాడ్ లు ఇవ్వటం కొసమెరుపు. ఇక ఇంకొందరైతే హోదా ఇవ్వకపోవటానికి, అందులో హామీలను నెరవేర్చకపోవటానికి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పెట్టిన పుల్లలు కారణమని వాదిస్తున్నారు.

కానీ, అదే పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మాత్రం విభజన టాపిక్ గా లెవనెత్తుతూ ఇదంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేసిన ఘోరమంటూ దుమ్మెత్తిపోశారు. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయిందని భావించిన సోనియా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపిస్తున్నాడు. మంగళవారం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన ఫైర్ అయ్యాడు. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతం నుంచి అన్ని సీట్లు త‌మ‌కే వ‌స్తాయ‌ని భావించి, త‌మ బిడ్డ‌ రాహుల్ గాంధీని ప్ర‌ధానిని చేయాల‌నే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాన్ని విడ‌దీయాల‌నుకుంటే అన్ని అంశాల‌ను స‌మ‌గ్రంగా ప‌రిశీలించాల‌ని తాను కోరిన‌ట్లు కావూరి పేర్కొన్నారు. రాజ‌కీయాలు చెప్ప‌లేనంత‌గా చెడిపోయాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు చీద‌రించుకునే ప‌రిస్థితులు వ‌స్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఉన్న అవినీతి ఇప్పుడు లేదని ఆయ‌న అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి దుస్థితికి కార‌ణం కాంగ్రెస్ పార్టీయేన‌ని అన్నారు. రాష్ట్రాన్ని ముక్క‌లు చేసే ముందు సీమాంధ్ర నేత‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే చివర్లో గతం తల్చుకుని ఏ లాభం? ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్నారు మరి రాష్ట్రానికి ఏం చేస్తారంటూ మీడియా నుంచి కావూరికి ఎదురు ప్రశ్నలే ఎదురుకావటంతో ఆయన మౌనంగా ఉండిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Kavuri Sambasiva Rao  AP special status  blame  Sonia  

Other Articles